China : ప్రపంచంలోనే ఈ కంప్యూటర్ సూపర్ స్పీడ్..డ్రాగన్ కంట్రీ ఘనత
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్వాంటం సూపర్ కంప్యూటర్‌ను డ్రాగన్ కంట్రీ సిద్ధం చేసింది. ఈ కంప్యూటర్ తయారీ విషయాన్ని చైనా ప్రభుత్వం సీక్రెట్‌గా ఉంచింది.

China
Fastest Quantum Computer : ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్వాంటం సూపర్ కంప్యూటర్‌ను డ్రాగన్ కంట్రీ సిద్ధం చేసింది. ఈ కంప్యూటర్ తయారీ విషయాన్ని చైనా ప్రభుత్వం సీక్రెట్‌గా ఉంచింది. ఈ క్వాంటం సూపర్ కంప్యూటర్‌ను సీక్రెట్ ల్యాబ్‌లో తయారుచేయడంలో చైనా శాస్త్రవేత్తలు విజయం సాధించినట్లు సమాచారం. ఈ కంప్యూటర్ ఆశ్చర్యకరమైన వేగాన్ని కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎక్స్ ఫ్లాప్ క్వాంటం కంప్యూటర్‌ను నిర్మించినట్లు చైనా నేషన్‌వైడ్ సూపర్ కంప్యూటింగ్ పరిశోధకులు పేర్కొన్నారు. ఈ యంత్రాన్ని చాలా ఏండ్లుగా ఎవరి కళ్లల్లో పడకుండా శాస్త్రవేత్తలు దాచి ఉంచారు.
Read More : NEET-2021 : నీట్‌లో తెలంగాణ విద్యార్థికి టాప్ ర్యాంక్
అలాగే, ప్రపంచంలోనే అత్యంత బలమైన, వేగవంతమైన కంప్యూటర్‌ను రూపొందిస్తుందని ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. ఈ పీసీ సాయంతో భూమిపై ఉన్న సాంప్రదాయిక కంప్యూటర్ సిస్టంల కంటే వంద ట్రిలియన్ సంఖ్యలను ఆవలీలగా గుణించే అవకాశాలు ఉన్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. మానవ సృజనాత్మకత కంటే వేగవంతంగా పనిచేయడం ఈ పీసీ ప్రత్యేకత. ఈ పీసీ తయారీకి దాదాపు ఎనిమిది సంవత్సరాల సమయం పట్టినట్లుగా భావిస్తున్నారు.
Read More : Huzurabad By Poll : ఐడీ కార్డు లేదా..నో ఎంట్రీ..బైఠాయించిన ఏజెంట్లు
చాలా ఏండ్లుగా క్వాంటం కంప్యూటర్ సిస్టమ్‌లను తయారుచేసేందుకు వివిధ దేశాల పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. అయితే, అందరికన్నా ముందుగా చైనా ఈ విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. రానున్న 10-15 సంవత్సరాలలో క్వాంటం కంప్యూటర్ సిస్టంలను క్రిప్టాలజీ సబ్జెక్ట్‌లోని వాస్తవ సమస్యలను పరిష్కరించేందుకు ఉపయోగించుకోవచ్చని ఆశిస్తున్నట్లు శాస్త్రవేత్త ఝూ తెలిపారు.