నడిరోడ్డుపై తల్లీ..పసిబిడ్డలపై చైనా పోలీసుల దాష్టీకం చూడండీ..

కారు ఎక్కబోతున్న ఓ తల్లీ..ఆమె ఎత్తుకున్న పసిబిడ్డపై నడిరోడ్డుపై చైనా పోలీసులు దాష్టీకం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ తల్లి తన బిడ్డను ఎత్తుకుని కారు ఎక్కబోతోంది. అదే సమయంలో ఇద్దరు పోలీసులు వచ్చి ఆమెను ఆపారు. పోలీసులకు..ఆమెకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు ఆమెను నడిరోడ్డుమీదనే పడేశారు. బిడ్డ పక్కనే పడిపోయినా ఏమాత్రం పట్టించుకోలేదు.
ఆమెను నానా దుర్భాషలాడుతూ ఇష్టమొచ్చినట్లుగా తిట్టారు. దారుణంగా ప్రవర్తించారు. ఆమెపై ఆ ఇద్దరు పురుష పోలీసులు కూర్చుని మోకాళ్లతో తొక్కిపెట్టారు. పక్కనే పడిపోయిన పసిబిడ్డ ఏడుస్తుంటే అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు వచ్చి ఎత్తుకున్నారు. ఆ మహిళపై పోలీసులు చేస్తున్న దౌర్జన్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అమెరికాలో శ్వేతజాతి పోలీసులు నల్లజాతీయుడైన జార్జ్ ప్లాయిడ్ పై చేసిన దారుణం..ఊపిరి ఆడక చనిపోవటంతో అగ్రరాజ్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో 2017లో చైనా పోలీసులు ఓ మహిళ..ఆమె పసిబిడ్డపై చేసిన దౌర్జన్యానికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read: భారత ఐటీ నిపుణులకు షాక్: అమెరికా వెళ్లాలంటే కష్టమే.. హెచ్-1 బీ వీసాలు నిలిపివేత!