ఆమెకు కరోనా.. పుట్టిన బిడ్డ సేఫ్

  • Published By: veegamteam ,Published On : February 10, 2020 / 05:27 AM IST
ఆమెకు కరోనా.. పుట్టిన బిడ్డ సేఫ్

Updated On : February 10, 2020 / 5:27 AM IST

కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు అన్ని వణికిపోతున్నాయి. ఒకవైపు కరోనా వైరస్ వల్ల చైనాలోని ప్రజలందరు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. అలాంటి కరోనా వైరస్ సోకిన ఒక మహిళా పండంటి బిడ్డకు జన్మిచ్చిన ఘటన తూర్పు చైనాలోని జీజియాంగ్ ప్రావిన్స్ లో చోటు చేసుకుంది. 

అసలు విషయం ఏమిటంటే.. ఆమె కరోనా వైరస్ బాధితురాలు కావాటంతో పుట్టిన బిడ్డ పై ఆ ప్రభావం ఉంటుందని వైద్యులు కలవరపడ్డారు. పుట్టుకతోనే ప్రాణాంతకమైన కరోనా వైరస్ తో పుట్టాడనుకోని అందరు ఆ బిడ్డపై జాలి చూపించారు. దాంతో జీజియాంగ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసెన్ చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యులు ఆ బిడ్డకి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను చేయించారు. ఆ పరీక్షలో నెగిటివ్ రావంటంతో, ఆ పిల్లవాడికి ఎటువంటి వైరస్ సోకలేదు అని వైద్యులు నిర్ధారించారు.

కరోనా వైరస్ సోకిన మహిళా ఎటువంటి వైరస్ సోకని పండంటి బిడ్డకు జన్మిచ్చిందని హాస్పిటల్ యాజమాన్యం వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో నెటిజన్లు ఆనందంతో ఆ బిడ్డ ‘లక్కీ బాయ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది భవిష్యత్తులోను ఆ బాబుకు ఎటువంటి వైరస్ రాకుండా ఉండాలన్ని, ఈ లక్ జీవితాంతం ఉండాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాం అని కామెంట్స్ చేస్తున్నారు.