Shocking news : దగ్గితేనే విరిగిపోయిన మహిళ ఎముకలు .. డాక్టర్లు చెప్పిన కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఓ వింత ఘటన జరిగింది. ఓ మహిళ దగ్గింది. అంతే ఆమె ఎముకలు విరిగిపోయాయి..!

Woman fractures 4 ribs while coughing
Shocking news : చైనాలో ఓ వింత ఘటన జరిగింది. ఓ మహిళ దగ్గింది. అంతే ఆమె ఎముకలు విరిగిపోయాయి..! ఏంటీ దగ్గితేనే ఎముకలు విరిగిపోయాయా? మాక్కూడా దగ్గు వస్తుంది దగ్గుతాం..కానీ మా ఎముకలు విరిగిపోలేదే..ఇది మరీ విచిత్రంగా ఉంది అని అనుకోవచ్చు. కానీ ఇది నిజంగానే జరిగింది చైనాలోని షాంఘైనగరంలో ఓ మహిళ విపరీతంగా దగ్గటంతో ఆమె పక్కటెముకలు విరిగిపోయాయి. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
షాంఘై నగరానికి చెందిన హువాంగ్ అనే మహిళ బాగా స్పైసీగా ఉన్న ఆహారం తిన్నది. ఆ తరువాత ఆమెకు దగ్గు వచ్చింది. అలా దగ్గు విపరీతంగా గ్యాప్ లేకుండా వచ్చింది. అది కంటిన్యూగా వస్తూనే ఉంది ఆమె దగ్గుతునే ఉంది. దగ్గుతున్న సమయంలో ఛాతీ నుంచి నొప్పి వచ్చింది. కానీ ఆమె పట్టించుకోలేదు. దగ్గే సమయంలో కాస్త పట్టేస్తుండటం మామూలే అనుకుంది. కానీ ఛాతీలో నొప్పిగా బాగా రావటంతో ఆస్పత్రికి వెళ్లింది. జరిగిన విషయం చెప్పింది. ఆమెను పరిశీలించిన డాక్టర్లు CT స్కానింగ్ చేశారు. ఆమెకుక నాలుగు పక్కటెముకలు విరిగిపోయినట్టు గుర్తించి ఆశ్చర్యపోయారు.
కేవలం విపరీతంగా దగ్గితేనే ఆమె ఛాతీలోని పక్కటెముకలు ఎందుకు విరిగిపోయాయన్న దానికి డాక్టరు కారణం కూడా చెప్పారు. ఆమె ఉండాల్సిన బరువకంటే చాలా తక్కువ బరువు ఉండడం వల్ల శరీరంలో ఎముకలకు ఆధారంగా ఉండే కండరం ఎదగలేదని..ఈ క్రమంలో ఆమె స్పైసీ ఫుడ్ తినటంతో వచ్చిన దగ్గు విపరీతంగా రావటంతో ఆమె దగ్గినప్పుడు అవి విరిగిపోయాయని చెప్పారు. ఆమె 171 సెంటీమీటర్ల పొడవు మరియు కేవలం 57 కిలోల బరువు ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఆమె కోలుకున్న తర్వాత సరైన భోజనం తిసుకుంటూ కొన్ని వ్యాయామాలు చేస్తే కండరాన్ని పెంచుకోవచ్చని తెలిపారు.