Covid in China : అట్లుంటది చైనాలో..ఎంత బలవంతంగా కోవిడ్ పరీక్షలు చేస్తున్నారో..!!
చైనాలో బలవంతంగా కరోనా పరీక్షలు చేయడం కలకలం రేపుతోంది. బలవంతపు కరోనా పరీక్షలు చేస్తున్న వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Covid In China
Covid in China : చైనాలో కరోనా తీవ్ర రూపం దాలుస్తోంది. మొదటివేవ్ కంటే ఇప్పుడు చైనా ప్రజలపై మరింత ఒత్తిడి పెట్టి పరీక్షలు చేస్తోంది. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో చైనాలో లాక్డౌన్ల మీద లాక్డౌన్లు విధిస్తున్నారు. ప్రజలు బయట కనిపిస్తే చాలు ఏదో జంతువుని పట్టుకున్నట్లుగా పట్టుకుని ఐసోలేషన్ లో పెట్టేస్తున్నారు. దీంతో ప్రజలు కరోనా కంటే లాక్‌డౌన్‌కే ఎక్కువ భయపడిపోతున్నారు. షాంఘై తదితర ప్రాంతాల్లో కరోనా లక్షణాలు లేకున్నా… ఐసోలేషన్లోకి పంపిస్తున్నారు. అలాగే షాంఘైను విడిచి విదేశీయులు వెళ్లిపోతున్నారు.
అయితే.. చైనాలో బలవంతంగా కరోనా పరీక్షలు చేయడం కలకలం రేపుతోంది. బలవంతపు కరోనా పరీక్షలు చేస్తున్న వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో ఓ మహిళను బలవంతంగా టెస్టింగ్ సెంటర్లో కూర్చోబెట్టి, కరోనా పరీక్షలు చేస్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది.ఆమె పరీక్ష చేయించుకోవటానికి నమూనాలు ఇవ్వటానికి సహకరించటంలేదు.
దీంతో వైద్య సిబ్బంది ఆమె మీద కూర్చుని మరీ నమూనాలు సేకరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ఈ వీడియో చూసినవారు చైనీయుల పరిస్థితిని తలచుకుని జాలిపడుతున్నారు.అలాగే భయపడుతున్నారుకూడా. అట్లుంటది చైనాలో..
这个强行检测姿势应该让全世界看一看?? pic.twitter.com/PUwnfCXF4t
— 浩哥i✝️i??iA2 (@S7i5FV0JOz6sV3A) April 27, 2022