అత్యాచారం జరగకుండా కరోనా వైరస్ కాపాడింది

  • Published By: vamsi ,Published On : February 5, 2020 / 05:02 AM IST
అత్యాచారం జరగకుండా కరోనా వైరస్ కాపాడింది

Updated On : February 5, 2020 / 5:02 AM IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని బయపెడుతుంది. ప్రాణాంతక కరోనా వైరస్ చైనాని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆ దేశంలో మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండగా.. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా వందల్లో చనిపోయారు. వేల సంఖ్యలో బాధపడుతున్నారు. రోజు రోజుకి కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతోండగా.. కేసుల సంఖ్య గణనీయంగా నమోదు అవుతుంది.

కరోనా వైరస్తో చైనాలో ఇప్పటివరకు 492మంది చనిపోయినట్లు లెక్కలు చెబుతుండగా.. ఓ మహిళ మాత్రం కరోనా వైరస్ పేరుతో అత్యాచారం నుంచి బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని వూహాన్‌కు 3 గంటల ప్రయాణ దూరంలో జింగ్‌షాన్‌ అనే ప్రాంతంలో ఒంటరిగా ఓ మహిళ నివాసం ఉంటుంది. అయితే ఆమె ఇంట్లోకి జియావో అనే వ్యక్తి చొరబడి అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆమె తెలివిగా కరోనా వైరస్ పేరును ఉపయోగించి తెలివిగా.. అతడి ముఖంపై దగ్గి.. తాను వూహాన్‌ నుంచి వచ్చానని, తనకు కరోనా సోకి ఉందని చెప్పింది.

అంతే ఆమెపై అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించిన జియావో అక్కడ నుంచి పారిపోయాడు. అయితే వెళ్లేటప్పుడు ఆమె ఇంట్లోంచి 3080 యువాన్లు(అంటే ఇండియన్ కరెన్సీలో రూ.30 వేలు) పట్టుకెళ్లాడు. ఈ ఘటనపై మహిళ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేయగా.. జియావోను మాత్రం పట్టుకోలేకపోయారు పోలీసులు. అయితే అజ్ఞాతంలో ఉన్న అతను కరోనా నిజంగానే సోకిందేమో అనే భయంలో తన తండ్రితో సహా వచ్చి పోలీసుల వద్ద నేరాన్ని ఒప్పుకొని లొంగిపోయాడు.