China : చైనాలో కొత్త ట్రెండ్ .. టెంపరరీ పార్టనర్స్‌ని కోరుకుంటున్న యువత
చైనా యువత కొత్త ట్రెండ్ ఫాలో అవుతోంది. ఒంటరిగా జీవించడం వైపు మొగ్గుచూపుతోంది. అందుకోసం పలు సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌లలో టెంపరరీ పార్టనర్స్ కోసం అన్వేషిస్తున్నారు

China
China : యువత ఆలోచన ధోరణిలో చాలా మార్పు సంతరించుకుంటోంది. ఉద్యోగం, డబ్బు సంపాదన, వ్యక్తిగత జీవితంపైనే ఎక్కువగా కాన్సన్‌ట్రేషన్ పెడుతున్నారు. జీవిత భాగస్వామిని ఎంపిక విషయంలో కూడా టెంపరరీ అనుబంధాల కోసం అన్వేషిస్తున్నారు. చైనాలో ఈ కొత్త సంప్రదాయం మొదలైంది అందుకు అసలు కారణాలు ఏంటి?
చైనా యువతలో పెరుగుతున్న ట్రెండ్ ప్రాముఖ్యతను సంతరించుకుంది. జీవితంలో ఒంటరిగా ఉండటానికి చాలామంది యువత ఆసక్తి కనపరుస్తున్నారు. ఒక తోడు కావాలనుకుంటే తాత్కాలిక భాగస్వాములను ఎంచుకుంటున్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ భాగస్వాములు పురుషులా? స్త్రీలా? అనే బేధం లేకుండా ఎంపిక చేసుకుంటున్నారట. ఒకే మనస్తత్వం ఉన్నవారితో స్నేహం చేయడానికి ఆసక్తి చూపుతున్నారట.
చైనాలో ముఖ్యంగా యువకులు ఈ టెంపపరీ పార్టనర్స్ కోసం Xiaohongshu వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నారట. ఆహారం, గేమింగ్, ఫిట్ నెస్, ప్రయాణం, వ్యవసాయం, కబుర్లు, సంగీతం వినడం వంటి అంశాల్లో పార్టనర్స్ ఆసక్తిని బట్టి ఈ కనెక్షన్‌లు ఏర్పడతాయట. వ్యక్తిగతంగా కలవనవసరం లేకుండా WeChat వంటి ప్లాట్ ఫారమ్‌లలో పాల్గొనేవారు ఈ అంశాలపై చర్చించుకుంటూ దగ్గరవుతున్నారట.
SCMPతో మాట్లాడిన కొందరు తాము ఒంటరిగా ఉండాలని .. స్వతంత్రంగా జీవించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. తమ వ్యక్తిగత జీవితంలోకి వెళ్లని వ్యక్తులతో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కల్చర్ ఇప్పటికే చాలా దేశాల్లో కనిపిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వివాహ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం లేకపోలేదు.