Syria: సిరియాలో ప్రతీకారదాడులు.. 1,000 మంది మృతి.. ఏం జరుగుతోందంటే?
వారే ఈ దాడుల్లో పాల్గొన్నట్లు సిరియా భద్రతా సిబ్బంది అంటున్నారు.

సిరియాలో తిరుగుబాటుదళాలు గత ఏడాది డిసెంబరులో రాజధాని డమాస్కస్‌ను ఆక్రమించడంతో ఆ దేశ అధ్యక్షుడు బషర్-అల్-అసద్ దేశాన్ని విడిచివెళ్లిన విషయం తెలిసిందే. అప్పటినుంచి అసద్ మద్దతుదారులు, భద్రతా దళాలకు మధ్య హింస జరుగుతోంది.
ఇప్పుడు ఇది మరింత ఉద్ధృతమైంది. రెండు రోజుల్లో 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అసద్ మద్దతుదారులు అధికంగా లటాకియాతో పాటు టార్టస్, జాబ్లేలో ఉంటారు. ఆయా నగరాల్లో కాల్పులు జరిగాయి. అసద్ తెగకు సంబంధించిన అలావైట్లు ఆ ప్రాంతాల్లో అధికంగా ఉంటారు.
వారే ఈ దాడుల్లో పాల్గొన్నట్లు సిరియా భద్రతా సిబ్బంది అంటున్నారు. జాబ్లేలో పెట్రోలింగ్‌లో ఉన్న సిరియా భద్రతా సిబ్బందిపై అసద్ మద్దతుదారులు దాడులు చేశారు. దీంతో ఆ ఇరు ఈ ఘర్షణలు ప్రారంభమయ్యాయి. తిరుగుబాటు నేతృత్వంలోని ప్రభుత్వం అధికారాన్ని తీసుకున్న మూడు నెలల తరువాత ఈ హింస హింస చెలరేగింది.
సిరియా దళాలు అసద్ మద్దతుదారులను లక్ష్యంగా చేసుకున్నారని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ దళాలు ఇటీవల జబుల్ సమీపంలో ఓ నిందితుడిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అలావైట్లు మెరుపుదాడి చేశారని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది.
భద్రతా దళాలు మధ్యధరా తీరం వెంబడి అలవైట్లు అధికంగా ఉండే ప్రాంతంలో భారీగా మోహరించాయి. అసద్ మద్దతుదారులు పాల్పడుతున్న దాడులకు దీటుగా ప్రతిస్పందిస్తున్నామని సిరియా సర్కారు చెబుతోంది. ఇవాళ హింస తాత్కాలికంగా ఆగిపోయింది. ప్రభుత్వం చాలా ప్రాంతాలపై తిరిగి నియంత్రణ సాధించింది. తీరప్రాంతం దిశగా అన్ని రహదారులను అధికారులు మూసివేశారు.