Coffee : గుండెకు మేలు చేసే కాఫీ

సాధారణంగా కాఫీ తాగితే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తుంటాయని చెపుతూ ఉంటారు. ఆరోగ్య సమస్యల మాట ఎలా ఉన్నా కొంతమందికి లేవగానే కాఫీ తాగనిదే ఆరోజు కార్యక్రమాలు మొదలు పెట్టలేనంతగా దానికి

Coffee : గుండెకు మేలు చేసే కాఫీ

coffee

Updated On : March 28, 2022 / 10:29 AM IST

Coffee :  సాధారణంగా కాఫీ తాగితే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తుంటాయని చెపుతూ ఉంటారు. ఆరోగ్య సమస్యల మాట ఎలా ఉన్నా కొంతమందికి  నిద్ర  లేవగానే కాఫీ తాగనిదే ఆరోజు కార్యక్రమాలు మొదలు పెట్టలేనంతగా దానికి ఎడిక్ట్ అయిపోయి ఉంటారు.

కాఫీ తాగితే అనారోగ్య సమస్యలు ఏమోగానీ .. ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం ఉన్నాయంటున్నారు డాక్టర్లు. కాఫీ తాగితే గుండెకు మాత్రం ఎంతో మేలు చేస్తుం‌దని లండన్ లో ఇటీవల నిర్వహించిన తాజా పరిశోధనలో వెల్లడయ్యింది.

రోజుకు కనీసం రెండు మూడు కప్పుల కాఫీ తాగితే హ్రుద్రోగాలు, గుండె సంబంధిత సమస్యలతో తక్కవ సమయంలోనే మరణించటం వంటి సమస్యలు 10 నుంచి 15 శాతం తగ్గుతాయని వ ఈ అధ్యయనంలో వెల్లడయ్యింది. గత పదేళ్లుగా బ్రిటన్ లోని 5 లక్షల మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు.

Also Read : Petrol-Diesel Price : దేశంలో తగ్గని పెట్రోల్, డీజిల్ ధరలు.. ఏడు రోజుల్లో ఆరోసారి పెంపు..!