రోబోలకు మీ ముఖం అరువు ఇస్తారా : ఈ కంపెనీ రూ.92 లక్షలు చెల్లిస్తుందట

  • Published By: sreehari ,Published On : October 25, 2019 / 01:16 PM IST
రోబోలకు మీ ముఖం అరువు ఇస్తారా : ఈ కంపెనీ రూ.92 లక్షలు చెల్లిస్తుందట

Updated On : October 25, 2019 / 1:16 PM IST

గ్రాఫిక్స్ మూవీల్లో రోబోలను చూశాం. హీరోల ఫేస్ మాస్క్ లతో రోబోలు స్టంట్స్ చేసి అలరిస్తుంటాయి. రోబో సైంటిఫిక్ ఒరియెంటెడ్ మూవీలకు ఫుల్ క్రేజ్ ఉంది. రోబో మూవీలను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆసక్తిగా వీక్షిస్తుంటారు. ఇలాంటి రోబోలకు హీరోల ఫేస్ మాస్క్ లకు బదులుగా మీ ఫేస్ మాస్క్ ఉంటే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? మీ ముఖంతో రోబోలు ఎలా ఉంటాయో చూడాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. బ్రిటీష్ రోబో తయారీ కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 

జీయోమిక్ అనే కంపెనీ పేరుతో ఔత్సాహికుల ఫేస్ మాస్క్ కావాలని కోరుతోంది. ఈ కంపెనీ రూపొందించే హ్యుమరైడ్ రోబోలకు మీ ఫేస్ మాస్క్ అమర్చుతారట. ఇలా మీ ముఖం రోబోలకు అరువు ఇచ్చినందుకు సదరు కంపెనీ రూ.92 లక్షల వరకు చెల్లిస్తుందట. ప్రస్తుతం ఈ హ్యుమరైడ్ రోబో ప్రాజెక్టుపై వర్క్ జరుగుతోందని పేరు తెలియని కంపెనీ వెల్లడించింది. NDA లేదా నాన్ డిస్ క్లోజర్ అగ్రిమెంట్ కింద జీయోమిక్ పేరుతో కంపెనీ ఈ రోబో మేకింగ్ ప్రాజెక్టు రన్ చేస్తోంది. 

ఒప్పందంలో భాగంగా కంపెనీ అసలు పేరును రివీల్ చేసేందుకు నిరాకరించింది. రోబో ఫేస్ కు ఎంపిక అయిన వారికి మాత్రమే కంపెనీ ప్రాజెక్టు పూర్తి వివరాలను తెలియజేస్తుందని ఓ రిపోర్టు తెలిపింది. రోబోకు అనువైనది ఉండి.. దయ, స్నేహపూరితంగా ఉండే ముఖం కలిగిన వారి కోసం కంపెనీ వెతుకుతోంది. ప్రొడక్షన్ ప్రారంభానికి ముందే రోబోకు సరిపోలే ముఖాన్ని ఎంపిక చేయాలని భావిస్తోంది. ఒకసారి ఎంపిక చేసిన వ్యక్తి ముఖాన్ని ఫిక్స్ చేశాక.. అదే ముఖంతో ప్రపంచవ్యాప్తంగా వేలాది వెర్షన్లతో రోబోలు పునరుత్పత్తి చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. 

వచ్చే ఏడాదిలో రోబోల ప్రొడక్షన్ ప్రారంభించి ఐదేళ్లలో పూర్తి స్థాయిలో డెవలప్ మెంట్ చేయాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం కంపెనీ స్వతంత్ర వీసీల నుంచి పెట్టుబడులతో పాటు షాంఘై నుంచి నిధులను సమకూర్చి రోబోలను తయారు చేయనుంది. జియోమిక్ అనే ఈ కంపెనీ ప్రస్తుతం థెరపీ కోసం పారో అనే రోబోలను రూపొందిస్తోంది. ఈ రోబోలతో సీనియర్ సిటిజన్లకు, ఆర్మీ వెటరన్స్ ఒంటరి జీవితానికి సాయంగా ఉండేలా రూపొందించారు.