Food Crises in Pakistan: ‘ప్రజలు ఒక్కపూటే తినండీ తక్కువ తినండీ’ : పాక్ మంత్రిగారి వ్యాఖ్యలు
దేశంలో ఆహారం సంక్షోభం తీవ్రంగా ఉంది..కాబట్టి ప్రజలు ఒక్కపూటే తక్కువగా తిని దేశం కోసం త్యాగం చేయండీ అంటూ పిలుపునిచ్చారు పాకిస్థాన్ మంత్రి.

Pakisthan Food Crices..ministers Shocking Solution To Citizens Food
Pakisthan Food Crices..ministers shocking solution to citizens food: పాకిస్థాన్ పరిస్థితి ఎలాఉందంటే..పంతానికి పోయి పక్కనరాలు ఇక్క లాక్కున్నట్లుగా ఉంది. పాకిస్థాన్ లో ఆహారం సంక్షోభం తీవ్రస్థాయిలోకి వెళ్లింది భారత్ తో వాణిజ్య వ్యాపారంపై ఆంక్షలు పెట్టుకున్నాక. నిత్యవసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రజలు ఏం కొనేలా లేదు.తినేలా లేదు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించాల్సిన పాలకు ప్రజల్ని తక్కువగా తినమని సలహాలిస్తున్నారు.
ఓ సభలో ఆయన ప్రసంగిస్తున్న మంత్రి “చాయ్‌లో పంచదార ఓ వంద పలుకులు వేసుకుంటాం అనుకోండి, అందులోంచి ఓ తొమ్మిది పలుకులు తగ్గిస్తే తీపి తగ్గిపోతుందా? మన దేశం కోసం, స్వావలంబన కోసం ఆ మాత్రం త్యాగం చేయలేమా? నేను రొట్టెలు వంద ముక్కలు తింటాననుకోండి. అందులో తొమ్మిది ముక్కలు తగ్గించి తినలేనా?” అంటూ వ్యాఖ్యానించారు.
Read more : Pak Sugar : ఇండియాను కాదనుకుంది..ఇప్పుడు అనుభవిస్తోంది
పాకిస్థాన్ లోని ఆహారం సంక్షోభాన్ని పరిష్కరించలేకపోగా పైగా ప్రజలకు పిచ్చి సలహాలు ఇచ్చి పాకిస్తాన్ అధీనంలో ఉన్న కశ్మీర్, గిల్గిట్-బాల్టిస్తాన్ వ్యవహారాల కేంద్ర మంత్రి అలీ అమీన్ గండాపూర్ తీవ్ర విమర్శలపాలయ్యారు. ‘దేశం లో ఆహార సంక్షోభం తీవ్రంగా ఉందని కాబట్టి ప్రజలు తక్కువగా తినాలి‘అని వ్యాఖ్యానించి వివాదంలో చిక్కుకున్నారు. మంత్రిగారు ఇచ్చే గొప్ప సలహాలు విని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.ముఖ్యంగా చక్కెర పిండి పదార్థాల ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ఇటువంటివాటినికి ప్రజలు తక్కువ తినాలని సూచించారు. ప్రస్తుతం మన దేశం ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. కాబట్టి పిల్లలను బానిసత్వం నుంచి కాపాడటానికి ప్రజలు ఒక్కపూట మాత్రమే తింటూ కొన్ని త్యాగాలు చేయాలి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Rear more : Crazy Woman :ఆహారం, కూరగాయలంటే ఆమెకు భయం..చూస్తే చాలు వణికిపోతుంది..ఏం తిని బతుకుతోందంటే..
మరోవైపు పాకిస్తాన్ లో ఒక్క కప్పు టీ రూ.40లు అమ్ముతోంది. పాకిస్తాన్ లో ఎక్కడ చూసినా టీ షాపులు ఉంటాయి. కానీ ప్రస్తుతం ఇప్పుడు అక్కడ రోడ్డు పక్క ఉండే ఛాయ్ షాప్ లో కూడా కప్పు టీ. రూ. 40లు అమ్ముతోంది. లీటర్ పాలు రూ.120 నుంచి రూ.190లు అమ్ముతున్నాయి. గ్యాస్ సిలిండర్ రూ.1500 నుంచి రూ.3000 లకు పెరిగినట్టు ఛాయ్‌వాలాలు వాపోతున్నారు. ధరలు ఇలా ఉంటే మరి చాయ్ ఎంత ధర అమ్మాలో మీరేచెప్పండి అంటూ వాపోతున్నారు.
ఇక భారత్ నుంచి చక్కర దిగుమతి చేసుకున్న సమయంలో చౌకగా దొరికేదని .. ఇప్పుడు వేరువేరు దేశాల నుంచి షుగర్ ను దిగుమతి చేసుకోవడంతో చక్కర ధర కూడా పెరిగిందని అక్కడ స్థానికులు వాపోతున్నారు. ఇప్పుడు టీ ధర పెరిగిపోవడంతో ఛాయ్ తాగేవారి సంఖ్య తగ్గింది. తాము పూర్తిగా ఉపాధి కోల్పోతున్నామని టి షాపుల వారు వాపోతున్నారు. ఇటువంటి పరిస్థితిని పరిష్కరించకుండా పిచ్చి సలహాలు చెప్పటమేంటంటూ ప్రజలు మండిపడుతున్నారు.