Cancer With Chicken: చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. చికెన్ తింటే క్యాన్సర్..! తాజా అధ్యయనంలో విస్తుగొలిపే విషయాలు..
మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ ముప్పు మహిళల్లో కన్నా పురుషుల్లోనే ఎక్కువగా ఉండే అవకాశముందట.

Cancer With Chicken: చికెన్ అంటే ఇష్టపడని వారు ఉండరు. కొందరికి రోజూ చికెన్ ఉండాల్సిందే. లేదంటే ముద్ద దిగదు. ఇక సండే వచ్చిందంటే కచ్చితంగా ఇంట్లో కోడి కూర వండాల్సిందే. ఇక పార్టీలు, ఫంక్షన్లలోనూ చికెన్ ఐటెమ్స్ కామన్. చికెన్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని డాక్టర్లు చెబుతారు. హెల్త్ కి మంచిది, పైగా చాలా టేస్టీగా ఉంటుందని చికెన్ ను తెగ తింటున్నారా? అయితే, మీకో షాకింగ్ న్యూస్. చికెన్ అతిగా తింటే క్యాన్సర్ ముప్పు పొంచి ఉందట. లేటెస్ట్ గా నిర్వహించిన ఓ అధ్యయనంలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. చికెన్ అతిగా తింటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్ (పేగు క్యాన్సర్) వచ్చే ప్రమాదముందని తేలింది.
చికెన్ లో ప్రొటీన్ కంటెంట్ ఎక్కువ. విటమిన్ బి12, కొలైన్ పుష్కలంగా ఉంటాయి. ఇది పిల్లల్లో నరాల వ్యవస్థను మెరుగు పరుస్తాయి. ఇది తింటే బలం వస్తుందని డాక్టర్లు చెబుతారు. పైగా రెడ్ మీట్‌తో పోలిస్తే హెల్త్ రిస్క్‌లు తక్కువ. చికెన్ తో ఇన్ని ప్రయోజనాలున్నా.. అదే పనిగా డైలీ తింటే మాత్రం ఇబ్బందులు తప్పవంటున్నారు. తాజా అధ్యయనంలో తేలింది ఏంటంటే.. వారానికి 300 గ్రాములకు మించి చికెన్ తింటే పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదముందట. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ ముప్పు మహిళల్లో కన్నా పురుషుల్లోనే ఎక్కువగా ఉండే అవకాశముందట.
పలు రకాల పౌల్ట్రీ ఉత్పత్తులు (కోడి, టర్కీ, బాతు లాంటి మాంసాలు) తినడం దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే అంశంపై శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. పరిశోధకులు దాదాపు 19 సంవత్సరాలు 4వేల మందికి పైగా వ్యక్తులపై రీసెర్చ్ చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు.
Also Read: వచ్చే 10 ఏళ్లలో AI అన్ని వ్యాధులను అంతం చేయగలదు : గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ సంచలన వ్యాఖ్యలు..!
వైట్ మీట్ ఎక్కువగా తీసుకుంటున్న వారిలో పెద్ద పేగు క్యాన్సర్ వచ్చిన వాళ్లున్నారు. పాంక్రియాటిక్ సమస్యలు, లివర్ జబ్బులు, కడుపు నొప్పి, రెక్టల్ క్యాన్సర్ లాంటి వాటినీ గుర్తించారు. ఇలా పరిమితికి మించి మాంసం తింటున్న వాళ్లలో సుమారు 27 శాతం మంది ఏదో ఓ జబ్బుతో బాధపడుతున్నారు. వీళ్లలో పురుషులే ఎక్కువ. వారానికి 200 గ్రాముల చికెన్ తిన్న వాళ్లలోనూ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్ వచ్చిన వాళ్లున్నారు. వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తిన్న వ్యక్తులు జీర్ణకోశ క్యాన్సర్ల కారణంగా చనిపోయే ప్రమాదం 27శాతం ఎక్కువగా ఉంది.
ఓవరాల్ గా అధ్యయనకర్తలు చెప్పింది ఏంటంటే.. చికెన్ మితంగా తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది. వారానికి 2 లేదా 3 రోజులు మాత్రమే తీసుకోవాలట. వారానికి 100 గ్రాముల వరకు తింటే ఎలాంటి ముప్పు ఉండదట. రోజూ కాకుండా గ్యాప్ ఇస్తూ వారానికి 2, 3సార్లు తినడం వల్ల ఇబ్బంది ఉండదట. క్యాన్సర్ వచ్చే ముప్పు కూడా తగ్గుతుందట.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here