ప్రపంచవ్యాప్తంగా 69 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకూ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతి రోజూ కరోనా కేసులు అధికమవుతున్నాయి. మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 69 లక్షలు దాటింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 69, 15, 040 కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 4 లక్షలకు చేరువలో ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా సోకి 3, 99, 938 మంది మృతి చెందారు.
భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. 24 గంటల్లో దేశంలో 9వేల 887మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 294 మంది చనిపోయారు.
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 2,36,657కి చేరుకోగా, మృతుల సంఖ్య 6,642కి చేరుకుంది. 1,15,942 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,14,073 మంది కోలుకున్నారు. భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పుడు ప్రపంచంలో 6 వ స్థానంలో ఉంది.