కరోనావైరస్ కిడ్నీలు దెబ్బతినడానికి దారితీస్తుంది.. ఎందుకంటే..
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి రోజుకో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తోంది. కరోనా వైరస్ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపి ప్రాణం తీస్తుందని

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి రోజుకో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తోంది. కరోనా వైరస్ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపి ప్రాణం తీస్తుందని
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి రోజుకో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తోంది. కరోనా వైరస్ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపి ప్రాణం తీస్తుందని ఇప్పటివరకు తెలుసు. తాజాగా మరో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. కరోనావైరస్ కిడ్నీలను దెబ్బతీస్తుందనే విషయం బయటపడింది. కరోనా వైరస్ బారిన పడిన వారిలో చాలామందికి కిడ్నీ సమస్యలు వస్తున్నట్టు డాక్టర్లు గుర్తించారు. దీని కారణంగా వారు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయని చెప్పారు.
మనిషి దేహంలోని అవయవాల్లో కిడ్నీలకు చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. శుద్దిచేసిన రక్తాన్ని గుండెకి పంపి మనిషి జీవన ప్రమాణాన్ని పెంచేవి కిడ్నీలు. అలాంటి కిడ్నీలపై కరోనావైరస్ ప్రభావం చూపుతుందని తేలింది. ఏ విధంగా అన్నది ఇంకా పూర్తి క్లారిటీ లేకున్నా, ప్రభావం చూపుతున్నది మాత్రం పక్కా అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
సెల్ అనే జర్నల్ లో ఓ కథనం వచ్చింది. అందులో కరోనా వైరస్ కిడ్నీలపై ఏ విధంగా ప్రభావం చూపుతుందనేది తెలిపారు. కరోనా వైరస్ నేరుగా కిడ్నీలపై దాడి చేస్తుంది. ACE2 అనే కణాలపై రిసెప్టార్ తో వైరస్ బైండింగ్ అవడం వల్ల కిడ్నీలపై ప్రభావం పడుతుంది. ACE2 అనేవి స్పెషల్ రిసెప్టార్స్. గుండె, ఊపిరితిత్తులతో పాటు కిడ్నీల్లో ఉండే సెల్స్ లో అవి ఉంటాయి.
కరోనావైరస్ సోకిన వారి దేహంలో అవయవాలకు సరిపడ ఆక్సిజన్ సరఫరా కాదు. కిడ్నీలు దెబ్బతినడానికి ఇదీ ఒక కారణం కావొచ్చని అమెరికాకు చెందిన నేషనల్ కిడ్నీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ హాలీ క్రామర్ తెలిపారు. కరోనా వైరస్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందన్న సంగతి తెలిసిందే. ఈ కారణంగా సరిపడ ఆక్సిజన్ అందడం ఆగిపోతుంది.
కిడ్నీలు దెబ్బతినడానికి మరో కారణం కరోనా వైరస్ రక్తంపై ప్రభావం చూపడమే. కరోనా వైరస్ సోకిన వ్యక్తుల్లో రక్తం గడ్డ కడుతుంది. ఇది కిడ్నీలు దెబ్బతినడానికి దారితీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రక్తం గడ్డ కడితే కిడ్నీలు ఆ రక్తాన్ని శుద్ధి చేయడంలో సమస్యలు వస్తాయి. రక్తం గడ్డకడితే అది రోగనిరోధక శక్తిపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. సైటోకైన్ స్టార్మ్ కు(cytokine storm) దారితీస్తుంది. సైటో కైన్స్ అనేవి వైరస్ పై దాడి చేసే గుణం కలిగి ఉంటాయి. ఎప్పుడైతే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది సైటో కైన్స్ ఉత్పత్తి తగ్గుతుంది. దాంతో మన దేహంలో వైరస్ విజృంభించడానికి ఆస్కారం ఏర్పడుతుంది.
కరోనా వైరస్ బాధితుల్లో వెంటిలేటర్ పై ఉన్న వారిలో 40శాతం మందిలో కిడ్నీ సమస్యలు వచ్చినట్టు గుర్తించామని డాక్టర్లు తెలిపారు. ఐసీయూలో ఉన్న సమయంలో కిడ్నీ సమస్యలు వస్తే ఇక ఆ వ్యక్తి బతికే చాన్స్ చాలా తక్కుsవ అని చెబుతున్నారు.