క్రీడలకు పాకిన కరోనా.. టోక్యో ఒలింపిక్స్ వాయిదా

జపాన్ ఒలింపిక్ క్రీడా మంత్రి టోక్యో ఒలింపిక్స్ 2020 వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. కరోనా వైరస్ కారణంగా వేసవికాలం జరగాల్సి ఉన్న ఈ టోర్నీని ఇయర్ ఎండ్‌లో నిర్వహించాలనుకుంటున్నారు. జపాన్ పార్లమెంట్లో సీకో హషీమొటో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీతో చేసిన ఒప్పందం ప్రకారం.. ఒలింపిక్ గేమ్స్ 2020లోనే నిర్వహిస్తుారు.
జులై 24నుంచి ఆగష్టు 9వరకూ జరగాల్సి ఉంది. ‘మా వల్ల అయినంత వరకూ టోర్నీ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం’ అని ఐఓసీ ప్రెసిడెంట్ థామస్ బాచ్ అన్నారు. ఒలింపిక్ తేదీ మార్చడంతో బ్రాడ్‌కాస్టర్లపై భారీ ప్రభావం చూపిస్తుంది. వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్, చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ ఆధ్వర్యంలోనే క్రీడా ఈవెంట్లన్నీ వాయిదా వేస్తుంటారు.
ఫిల్మ్, టీవీ ఇండస్ట్రీలు ఈవెంట్లను క్యాన్సిల్ చేయొద్దంటూ మొరపెట్టుకుంటున్నాయి. కరోనా కారణంగా ప్రపంచ స్థాయిలో పారిస్, లీజిగ్‌ల వేదికలుగా జరిగే బుక్ ఫెయిర్ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేశారు. ప్రపంచవ్యాప్తంగా 86వేల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. 50దేశాలకు పైగా ఈ మహమ్మారి అంటుకుంది. 3వేలకు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చైనాలోనే ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది.