ఫండింగ్‌ కోసం 4 నెలల పసికందుతో విన్యాసాలు

  • Published By: veegamteam ,Published On : February 5, 2019 / 10:07 AM IST
ఫండింగ్‌ కోసం 4 నెలల పసికందుతో విన్యాసాలు

Updated On : February 5, 2019 / 10:07 AM IST

రష్యాకు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ప్రపంచ పర్యటన చేయాలని భావించాడు. ఇందులో భాగంగా సోమవారం కౌలాలంపూర్‌కు చేరుకున్నారు. ప్రపంచ పర్యటనకై డబ్బులు సంపాదించేందుకు కూతురిని గాల్లోకి ఎగురవేస్తూ ఆ చిన్నారి పట్ల క్రూరంగా ప్రవర్తించారు. వీధుల్లో నాలుగు నెలల పసికందుతో విన్యాసాలు చేస్తూ తమాషా చేశారు. ఆమె ఏడుస్తున్నా పట్టించుకోకుండా తలకిందులుగా వేలాడదీస్తూ తన ఆటను కొనసాగించాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న చిన్నారి తల్లి.. ‘ మేము ప్రపంచ పర్యటన చేస్తున్నాం’ అనే ప్లకార్డు పట్టుకుని కూర్చుని ఉంది. దీంతో ఆగ్రహించిన మలేషియా పోలీసులు సోమవారం (ఫిబ్రవరి 4,2019) వారిని అదుపులోకి తీసుకున్నారు.

 

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. కాగా ఈ వీడియోపై మండిపడిన నెటిజన్లు.. ‘ స్టుపిడ్‌.. మీ సరదా కోసం చిన్నారిని ఇలా హింసిస్తారా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.