అమెరికా ఎయిర్ పోర్ట్ లో ఆవు పిడకల కలకలం
అమెరికా రాజధాని వాషింగ్టన్ ఎయిర్ పోర్ట్ లో ఓ భారతీయ ప్రయాణికుడు వదిలేసిన సూట్ కేసు అధికారులకు కొద్దిసేపు చెమటలు పట్టించింది.

Cow Dung Cakes Found In Baggage Of Indian Passenger At Us Airport Destroyed
Cow dung cakes అమెరికా రాజధాని వాషింగ్టన్ ఎయిర్ పోర్ట్ లో ఓ భారతీయ ప్రయాణికుడు వదిలేసిన సూట్ కేసు అధికారులకు కొద్దిసేపు చెమటలు పట్టించింది. తీరా ఆ సూట్ కేస్ తెరిచి చూసిన యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్(CBP)అధికారులు అందులో ఉన్న ఆవు పేడతో చేసిన పిడకలను చూసి కంగుతిన్నారు. గత నెల 4న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
ఏప్రిల్-4న ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన ఓ భారతీయ ప్రయాణికుడు విమానాశ్రయం లగేజీ కౌంటర్ వద్ద వదిలేసిన సూట్‌కేసును కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అందులో ఆవు పేడతో చేసిన పిడకలు ఉన్నట్లు గుర్తించారు. భారత్ నుంచి ఆవు పేడతో చేసిన పిడకలు తీసుకురావడంపై అమెరికాలో నిషేధం ఉంది.
అమెరికాలో నిషేధం ఉండడంతో అలా చేసి ఉంటారని.. వాటిని ధ్వంసం చేసినట్లు సోమవారం ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. ఆవు పేడ స్థానికంగా ఉన్న పశుసంపదపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని.. కాలి, నోటి సంబంధిత వ్యాధులు వస్తాయని అక్కడి వ్యవసాయ అధికారులు తెలిపారు. పశువుల్లో వ్యాధి సంక్రమణ కారణంగా తమ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగే అవకాశం కూడా ఉండడంతో నిషేధం ఉన్నట్లు పేర్కొన్నారు.