ఉగ్రవాదుల కోసం గాలింపు : శ్రీలంకలో కర్ఫ్యూ ఎత్తివేత

శ్రీలంకలో బాంబు దాడులు చేసి 215 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల కోసం అక్కడి పోలీసులు గాలిస్తున్నారు. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం ఈస్టర్ పండుగ పూట ఉగ్రవాదులు బాంబు దాడులతో పేట్రేగిపోయారు. మొత్తం 8 చోట్ల బాంబులు పేల్చారు. క్రైస్తవ ప్రార్థనా సంస్థలు, హోటళ్లను లక్ష్యంగా దాడులు జరిగాయి. వరుస పేలుళ్లలో 35 మంది విదేశీయులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 5గురు భారతీయులున్నారు. బాంబు పేలుళ్ల ధాటికి మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. అక్కడ భీతావహ పరిస్థితి ఏర్పడింది.
వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో కొలంబోలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని వెల్లడించింది. ఏప్రిల్ 22వ తేదీ కర్ఫూను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయిన శ్రీలంక ఇప్పుడు కొలుకొంటోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 500 మందికిపైగా గాయాలపాలయ్యారు. వీరంతా స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Also Read : శ్రీలంక బాంబు పేలుళ్లు : హైదరాబాద్ లో అలర్ట్ : HMWSSB Also
ఇదిలా ఉంటే నిఘా వర్గాలు అలర్ట్ చేసినా ప్రభుత్వం వైఫల్యం చెందిందని స్వయంగా ప్రధాని అంగీకరించారు. ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నాయని ఏప్రిల్ 4వ తేదీన భారత్ ఇంటెలిజెన్స్ శ్రీలంక ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఎన్టీజే ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడులకు పాల్పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఏప్రిల్ 04వ తేదీ నుండి ఏప్రిల్ 14వ తేదీ వరకు అలర్ట్ ప్రకటించారు అక్కడి పోలీసులు. అనంతరం ఎలాంటి దాడులు జరగలేదు. దీనితో వారు రిలీఫ్ ఇవ్వడంతో దీనిని ఉగ్రవాదులు క్యాష్ చేసుకున్నారు.
ఏప్రిల్ 14వ తేదీన రెక్కీ నిర్వహించిన ఉగ్ర మూకలు ఈస్టర్ పండుగ వేళ పేలుళ్లు జరపాలని డిసైడ్ అయ్యారు. అనంతరం ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం 8 పేలుళ్లు చేశారు. కొలంబో ఎయిర్ పోర్టు సమీపంలో ఉన్న 9వ బాంబును బాంబ్ స్వ్కాడ్ నిర్వీర్యం చేశాయి. మొత్తం ఈ ఘటనలో 13మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read : బరిలో షీలా దీక్షిత్ : ఢిల్లీ లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్