అమెరికాలో 31వేల కరోనా మరణాలు…ట్రంప్ ఏమంటున్నాడో తెలుసా!

  • Published By: Mahesh ,Published On : April 16, 2020 / 06:08 PM IST
అమెరికాలో 31వేల కరోనా మరణాలు…ట్రంప్ ఏమంటున్నాడో తెలుసా!

Updated On : April 16, 2020 / 6:08 PM IST

అమెరికాలో  గురువారం కరోనా మరణాల సంఖ్య  30వేల మార్క్ దాటింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ తెలిపిన వివరాల ప్రకారం…అమెరికాలో ఇప్పటివరకు 30,990కరోనా మరణాలు సంభవించాయి. ప్రపంచంలో మరే ఇతర దేశంలోనూ అమెరికాలో నమోదైనన్ని కరోనా మరణాలు నమోదవలేదు. అమెరికా తర్వాత కరోనా మరణాలు ఎక్కువ నమోదైన దేశం ఇటలీ. అమెరికా జనాభాలో ఐదవ వంతు జానాభా ఉన్న ఇటలీలో ఇప్పటివరకు 21,645కరోనా మరణాలు సంభవించాయి. ఇక కరోనా మరణాల్లో మూడవస్థానంలో స్పెయిన్ నిలిచింది. స్పెయిన్ లో ఇప్పటివరకు 17,167కరోనా మరణాలు నమోదయ్యాయి.

ఇక,కరోనా కేసుల్లో కూడా అమెరికానే టాప్ లో నిలిచింది. యూఎస్ లో కరోనా కేసుల సంఖ్య 6లక్షల 46వేలుగా ఉంది. అటు మరణాలు,ఇటు కేసులు రెండింటిలో అమెరికానే అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా న్యూయార్క్ లో పరిస్థితి దారుణంగా ఉంది.  ప్రపంచంలోని ఏ దేశంలో నమోదవనన్ని కరోనా కేసులు ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. అంతేకాకుండా అమెరికాలో నమోదైన కరోనా మరణాల్లో దాదాపు సగం న్యూయార్క్ లోనే నమోదయ్యాయి.

ఇప్పటికే అమెరికాలోని 50రాష్ట్రాల్లో చరిత్రలో తొలిసారిగా ఎమర్జెన్పీ విధించిన విషయం తెలిసిందే. అమెరికా ఎకానీమీ రీపెన్ ప్రాణాళికలను ఆవిష్కరించనున్నట్లు గురువారం అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్ ప్రమాణం చేశారు. రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతున్నప్పటికీ, కరోనా సంక్షోభం యొక్క పీక్ స్టేజ్ ను అమెరికా దాటేసిందని ట్రంప్ అన్నారు. మే-1కంటే ముందే కరోనా ప్రభావం తక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఆంక్షల సడలింపు ఉంటుందని ట్రంప్ సూచించారు.

మరోవైపు, కరోనా హాట్ స్పాట్ గా అమెరికా మారడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)కారణంటూ కొన్ని రోజులుగా డబ్యూహెచ్ వోపై తీవ్ర విమర్శలు చేస్తుూ వచ్చిన ట్రంప్ ఇప్పుడు ఆ సంస్థపై ప్రతీకార చర్యలకు దిగారు. తొలినాళ్లలో వైరస్‌ వ్యాప్తిని డబ్ల్యూహెచ్‌ఓ కావాలనే కప్పిపుచ్చిందని ఆరోపణలు చేస్తున్న ట్రంప్‌…ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)కు నిధులు అందజేసే విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నంత పని చేశారు. తమ దేశం నుంచి సంస్థకు అందించే నిధుల్ని పూర్తిగా నిలిపివేయాలని అధికారుల్ని ట్రంప్ ఆదేశించారు. WHO బాధ్యతాయుతంగా నడుచుకునేలా ఆదేశించే హక్కు సంస్థకు అత్యధిక నిధులు అందిస్తున్న అమెరికాకు ఉందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.