చైనాలో కరోనా వ్యాప్తికి ప్రూఫ్ ఉన్నా.. వుహాన్ వెట్ మార్కెట్లు తెరిచే ఉంచాలన్న WHO

చైనాలోని వుహాన్ సిటీలో వెట్ మార్కెట్ల నుంచే కరోనా వైరస్ ఉద్భవించిందనే ప్రూఫ్ ఉన్నప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ మాంసం మార్కెట్లను తెరిచే ఉంచాలని వెల్లడించింది. వెట్ మార్కెట్లను బంద్ చేయాలని పెద్ద ఎత్తున ప్రజలు డిమాండ్ చేసినప్పటికీ WHO మాత్రం ఆయా మార్కెట్లపై నిషేధం విధించేది లేదని స్పష్టం చేసింది. కరోనా వైరస్‌కు మూలమైన వుహాన్ వెట్ మార్కెట్లో బతికి ఉన్న జంతువులను విక్రయిస్తుంటారు.
ఇక్కడి నుంచే వైరస్ పుట్టి ఇప్పుడు ప్రపంచమంతా విస్తరిస్తోంది. ఏదిఏమైనా ఈ వెట్ మార్కెట్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటువ్యాధులకు కారణంగా పరిగణించడం లేదు. డబ్ల్యూహెచ్ఓ ఫుడ్ సేఫ్టీ అండ్ యానిమల్ డిసిజెస్ నిపుణులు Peter Ben Embarek చెప్పిన ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి అవసరమైన అహారాన్ని అందించేందుకు ‘లైవ్ యానిమల్ మార్కెట్లు’ ఎంతో కీలకమని అంటోంది.
ఇలాంటి మార్కెట్ల విషయంలో అధికారులు మెరుగైన సదుపాయాలను కల్పించేలా దృష్టిపెట్టాలని సూచిస్తోంది. ఈ పరిసరాల్లో ఆహార భద్రత కష్టమైనప్పటికీ కొన్నిసార్లు ఈ మార్కెట్లలోనే ఇలాంటి సంఘటనలు జరగడం ఆశ్చర్యాన్ని కలిగించదని Ben Embarek వివరించారు. ఆహార భద్రత ప్రమాణాలు, పరిశుభ్రతను మెరుగుపరచడం ద్వారా రద్దీగా ఉండే వెట్ మార్కెట్లలో జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సోకే ప్రమాదాన్ని తగ్గించవచ్చునని విశ్వసిస్తున్నట్టు బెన్ చెప్పకొచ్చారు.
అయినప్పటికీ గతంలోనే WHO కరోనా వైరస్ గబ్బిలాల నుంచి వస్తుందని వెల్లడించినట్టు Embarek తెలిపారు. చైనాలో మొదట డజన్లమందికి కరోనా వైరస్ సోకడానికి వుహన్ వెట్ మార్కెట్లతో సంబంధం ఉందనే దానిపై స్పష్టత లేదన్నారు. కానీ, కరోనాకు మూలం లేదా వైరస్ వ్యాప్తి చెందడంలో చైనా కేవలం పాత్ర పోషించదని రిపోర్టు తెలిపింది. ఈ రోజు వరకు.. చైనా WHO లేదా దేశం బయట నిపుణులను కరోనావైరస్ సంబంధిత దర్యాప్తులో భాగం కావాలని ఆహ్వానించినట్లు నివేదికలు లేవు. ఇతరులతో సహకరించడానికి చైనా అంగీకరించలేదు.