Cesarean : మహిళ కడుపులో ప్లేట్‌ పెట్టి కుట్టేసిన డాక్టర్లు.. !

మహిళ కడుపులో కత్తెర పెట్టి కుట్టేశారనే వార్తలు విని ఉంటాం. కానీ ఈ డాక్టర్లు అంతకు మించి అన్నట్లుగా ఓ మహిళ కడుపులో ఏకంగా డిన్నర్ ప్లేట్ సైజులో ఉండే ఓ ప్లేటును పెట్టి కుట్లు వేసేశారు.

Cesarean : మహిళ కడుపులో ప్లేట్‌ పెట్టి కుట్టేసిన డాక్టర్లు.. !

plate inside woman stomach

Updated On : September 6, 2023 / 11:31 AM IST

Cesarean operation : డాక్టర్లు ఆపరేషన్లు చేసిన సమయంలో కడుపులో దూది పెట్టి కుట్టేశారని..కత్తెర పెట్టి కుట్టేశారనే వార్తలు విన్నాం. కానీ అంతకుమించి అన్నట్లుగా ఓ మహిళకు సిజేరియన్ ఆపరేషన్ చేసిన డాక్టర్ల బృందం ఏకంగా ఆమె కడుపులో ఓ ప్లేట్ పెట్టి కుట్టేశారు. గర్భిణికి సిజేరియన్ చేసిన డాక్టర్లు బిడ్డను తీశారు. బిడ్డ కూడా బాగానే ఉంది.కానీ కుట్లు వేసే సమయంలో ఏకంగా ఓ ప్లేట్ కడుపులో పెట్టి కుట్లు వేసేసిన ఘటన న్యూజిలాండ్ ( New Zealand) లో చోటుచేసుకుంది.

న్యూజిలాండ్ ( New Zealand) హెల్త్ అండ్ డిసేబిలిటీ కమిషనర్ మొరాగ్ (Health and Disability Commissioner, Morag McDowell)సోమవారం (సెప్టెంబర్ 4,2023) విడుదల చేసిన నివేదిక ప్రకారం..20 ఏళ్ల వయస్సున్న ఓ మహిళ పురిటి నొప్పులతో ప్రసవం కోసం అక్లాండ్ నగరంలోని ఓ ఆస్పత్రిలో చేరింది. ఆమెకు నార్మల్ డెలివరీ కోసం డాక్టర్లు యత్నించాడు. కానీ ఎంతకూడా అవ్వకపోవటంతో డాక్టర్లు సిజేరియన్ చేశారు. తల్లీ బిడ్డా బాగానే ఉన్నారు. తరువాత కొన్ని రోజులకు డిశ్చార్జ్ అయి వెళ్లిపోయారు. కానీ ఆమె ఏడాదిన్నర నుంచి కడుపు నొప్పితో బాధపడుతోంది. డాక్లర్లకు చూపించుకుంది. వారి సూచనల మేరకు మెడిసిన్స్ వాడింది. కానీ ఫలితం లేదు.

United States : ఆ స్పైసీ చిప్స్ తిన్నాడు.. కొన్ని గంటల్లోనే…

దీంతో డాక్టర్లు ఆమెకు సిటీ స్కాన్ చేశారు. రిపోర్టు చూసి షాక్ అయ్యారు. ఆమె కడుపలో ఏకంగా ఓ ప్లేట్ ఉందని గుర్తించారు. అదే విషయం ఆమెకు చెప్పారు. ఆమె ఏడాదిన్నర క్రితం తనకు సిజేరిన్ చేశారని అప్పటి నుంచి తనకు ఎటువంటి సర్జరీ జరగలేదని కానీ కడుపునొప్పితో తీవ్రమైన బాధ కలిగిందని తెలిపింది. దీంతో డాక్టర్లు ఆశ్చర్యపోయారు. జరిగింది ఊహించారు. ఆమెకు వెంటనే సర్జరీ చేసి ఆ ప్లేటును తీసివేశారు. ఆ ప్లేటును పరిశీలించగా సర్జరీ సమయంలో మహిళకు అత్యవసర శస్త్ర చికిత్స చేసి వస్తువును తొలగించారు. అది అలెక్సిస్ రిట్రాక్టర్ అని తేలింది. సిజేరియన్ చేసే సమయంలో డాక్టరు ఉపయోగించే అలెక్సిస్ రిట్రాక్టర్ (Alexis retractor) అని తేలింది. అది డిన్నర్ ప్లేటు సైజులో ఉంటుంది. సిజేరియన్ సమయంలో దాన్ని ఆమె ఆమె కడుపులో పెట్టి కుట్లు వేసినట్లుగా గుర్తించారు. సర్జరీ సయమంలో డాక్టర్లు దూది, కత్తెర, కాటన్ క్లాత్ వంటివి మర్చిపోయి కుట్లు వేశారనే వార్తలు విన్నాం కానీ మరీ ఇంత నిర్లక్ష్యమా..? అనిపించేలా ఉందీ ఘటన.