Galentines Day 2024 : ‘వేలంటైన్స్ డే’ ఓకే.. ఈ ‘గాలంటైన్స్ డే’ చరిత్ర ఏంటి… ఎప్పుడు జరుపుకుంటారంటే?
ప్రేమికులు జరుపుకునేది 'వాలంటైన్స్ డే' మరి ఈ 'గాలంటైన్స్ డే' ప్రత్యేకత ఏంటి? అసలు ఎవరు జరుపుకుంటారు...

Galentines Day 2024
Galentines Day 2024 : ఫిబ్రవరి 14న ప్రేమ పక్షులన్నీ ‘వాలంటైన్స్ డే’ సెలబ్రేట్ చేసుకుంటాయి. అయితే ఈ రోజుకి ముందు రోజు అంటే ఫిబ్రవరి 13న ‘గాలంటైన్స్ డే’ జరుపుకోవడం ఇప్పుడు ఆనవాయితీగా మారింది. అసలు ఇదేం ట్రెండ్? దీని చరిత్ర ఏంటి? అంటే..
Bollywood News : ఈ ‘వాలంటైన్స్ డే’కి మీరు సింగిలా.. డోన్ట్ వర్రీ అంటున్న బాలీవుడ్ స్టార్
ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు. ఈ తేదీకి 6 రోజుల ముందు నుండి సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతాయి. రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే ఇక 14వ తేదీన వాలంటైన్స్ డే జరుపుకుంటారు. అయితే ఈ డేకి ముందు రోజు ఫిబ్రవరి 13న ‘గాలంటైన్స్ డే’ జరుపుతారు. దీని వెనుక కూడా చరిత్ర ఉంది. ‘లేడీస్ సెలబ్రేటింగ్ లేడీస్’ అనే కాన్సెప్ట్‌తో జరిగే ఈ వేడుక లెస్లీ నోప్ అనే పాత్ర ద్వారా ప్రాచుర్యం పొందింది. విషయం ఏంటంటే. 2010 లో అమెరికన్ కామెడీ టెలివిజన్ సిరీస్ ‘పార్క్స్ అండ్ రిక్రీయేషన్ రెండవ సీజన్ లో 16వ ఎపిసోడ్‌లో ఈ రోజు గురించి ప్రస్తావన ఉందట. ఈ ఎపిసోడ్‌లో లెస్లీ నోప్ (అమీ పోహ్లర్) గాలెంటైన్స్ డే రోజు తన స్నేహితులందరినీ పిలిచి పార్టీ ఇస్తుందట. ఇది ప్రత్యేకంగా మహిళల మాత్రమే సెలబ్రేషన్ చేసుకునే రోజన్నమాట. లెస్లీ నోప్ ద్వారా ఈ డే ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక 2017 నుండి ఈ వేడుకను జరుపుకోవడం ప్రారంభించారట.
Valentines Day 2024 : ఈ ‘వాలంటైన్స్ డే’కి రీ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటో తెలుసా? ఏకంగా 9 సినిమాలు
ఆడవారు గాలెంటైన్స్ డేని తల్లి, చెల్లితో కూడా జరుపుకుంటారట. లేదా తమకు ప్రియమైన వారి కోసం పార్టీ నిర్వహిస్తారట. ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటారు. థ్యాంక్స్ చెప్పుకుంటారు. పగలు మాత్రమే కాదు.. రాత్రి పూట కూడా ఈ వేడుకను ప్లాన్ చేసుకుంటారు. కొందరు ప్రశాంతంగా ఇళ్లలో జరుపుకుంటే.. కొందరు సినిమాలు కూడా ప్లాన్ చేసుకుంటారట. ఆడవారు ఆడవారిని గౌరవించుకోవడం.. అభిమానించుకోవడం.. ఒకకొకరు సపోర్ట్ చేసుకోవడమే ఈ వేడుక వెనుక ముఖ్య ఉద్దేశమట. ప్రస్తుతం మన ఇండియాలోని సెలబ్రిటీలు ఈ డేని సంప్రదాయంగా జరుపుకుంటూ వస్తున్నారు.