600 కుక్కలు ఆత్మహత్య : మిస్టరీ వంతెన  

కుక్కలు ఆ బ్రిడ్జ్ వద్దకు వెళితే చాలు ఆత్మహత్య చేసుకుంటున్నాయట. ఇలా ఇప్పటి వరకూ 600లకు పైగా కుక్కలు ఈ వంతెన మీద నుంచి దూకి (ఆత్మహత్య)చచ్చిపోయాయట. అసలు జంతువులు ఆత్మహత్య చేసుకుంటాయా.

  • Published By: veegamteam ,Published On : March 18, 2019 / 11:14 AM IST
600 కుక్కలు ఆత్మహత్య : మిస్టరీ వంతెన  

కుక్కలు ఆ బ్రిడ్జ్ వద్దకు వెళితే చాలు ఆత్మహత్య చేసుకుంటున్నాయట. ఇలా ఇప్పటి వరకూ 600లకు పైగా కుక్కలు ఈ వంతెన మీద నుంచి దూకి (ఆత్మహత్య)చచ్చిపోయాయట. అసలు జంతువులు ఆత్మహత్య చేసుకుంటాయా.

ప్రపంచంలో ఎన్నో వింతలు..విశేషాలు..మానవుడు మేథస్సుకు చిక్కని మిస్టరీలెన్నో. అటువంటి ఓ మిస్టరీ బ్రిడ్జ్ మూగ జీవాలను బలిగొంటోంది. విశ్వాసానికి ప్రతిరూపంగా చెప్పుకునే కుక్కలు ఆ బ్రిడ్జ్ వద్దకు వెళితే చాలు ఆత్మహత్య చేసుకుంటున్నాయట. ఇలా ఇప్పటి వరకూ 600లకు పైగా కుక్కలు ఈ వంతెన మీద నుంచి దూకి (ఆత్మహత్య)చచ్చిపోయాయట. అసలు జంతువులు ఆత్మహత్య చేసుకుంటాయా. అంటే కాదంటారు నిపుణులు..కానీ ఆ వంతెనమీదకు వెళితే కుక్కలు ఆటోమేటిగ్గా వంతెన మీద నుంచి క్రిందికి దూకేస్తాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో ‘‘ద బ్రిడ్జ్ ఆఫ్ డెత్’ గా పేరొచ్చింది. ఇది స్కాట్‌ల్యాండ్‌లోని గ్లాస్‌గౌవ్ నగరానికి సమీపంలో ఉంది. 
Read Also : ఓరి ద్యావుడా : చచ్చిన ఎలుకలతో వైన్, గబ్బిలాల సూప్

ప్రాణుల్లో ఆత్మహత్య చేసుకునే  మానవజాతి ఒక్కటే అంటారు. కానీ కుక్కలు కూడా ఆత్మహత్య చేసుకుంటాయా అని కచ్చితంగా అనుమానం వస్తుంది. కానీ ఈ ‘ద బ్రిడ్జ్ ఆఫ్ డెత్’ కుక్కల ప్రాణాల్ని హరిస్తోందట. గ్లాస్‌గౌవ్ నగరానికి 160 సంవత్సరాల క్రితం మెటర్నటీ ఆస్పత్రిగా ఉపయోగించిన ఓవర్టాన్ అనే 19వ శతాబ్దానికి చెందిన కోటకు దగ్గర్లో ఉంది ఈ వంతెన. 

ప్రస్తుతం ఈ కోటలో సినిమా షూటింగ్స్ జరిగే ఈ కోటకంటే ఈ వంతెనే ఎక్కువగా వార్తల్లో ఉంటుంది. దానికి కారణం కుక్కలు ఆత్మహత్య చేసుకోవటమే. దీంతో 1950 నుంచి ప్రజలు ఈ వంతెనను ‘ద బ్రిడ్జ్ ఆఫ్ డెత్’ అని పిలవడం మొదలుపెట్టారు. కానీ మనుషుల తరహాలో కుక్కలు ఆత్మహత్యలు చేసుకోవనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2005లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన డాక్టర్ డెవిడ్ సాండ్స్ అనే సైకాలజిస్ట్ ఈ మిస్టరీని చేధించేందుకు ఈ వంతెన వద్దకు వెళ్లాడు.
Read Also : అయోమయం సృష్టించొద్దు… కాంగ్రెస్ 7సీట్ల ఆఫర్ పై మాయా ఫైర్

తనతోపాటు ఓ కుక్కను.. కెమేరా టీమ్‌ను కూడా తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..‘‘కుక్కల సంగతి ఎలా ఉన్నా..వంతెన మీదకు ఎక్కిన తర్వాత నాకు ఒళ్లంతా మండిపోతున్నట్లు అనిపించిదనీ..నాతో తీసుకెళ్లిన 19 ఏళ్ల కుక్క హ్యండ్రిక్స్ ఒక్క ఉదుటున వంతెన మీద నుంచి దూకేసిందనీ..కానీ కుక్క ప్రాణాలతోనే బైటపడింది..ఆ సమయంలో కుక్క చాలా ఒత్తిడికి లోనైనట్లు కనిపించింది. అందుకే అది అక్కడి నుంచి దూకేసిందని అనిపించింది’’ అని డెవిడ్ సాండ్స్ తెలిపారు.

ఆ వంతెన నిర్మాణంలో ఏదో లోపం ఉందని..అటువంటి ఫ్రీక్వెన్సీని కేవలం కుక్కలు మాత్రమే గ్రహించగలవీ అన్నారు.అయితే.. కుక్కలు ఆత్మహత్య చేసుకోవటం కాదు కానీ  అక్కడ ఒత్తిడికి గురైన సందర్భంలో అనాలోచితంగా దూకేస్తున్నాయని అనుకుంటున్నానని తెలిపారు. కాగా..ఈ మిస్టరీపై ఎంతమంది ఎన్ని పరిశోధనలు చేసినా..మిస్టరీని చేధించలేకపోతున్నారట. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే కుక్కలన్నీ వంతెనకు కుడివైపుకు మాత్రమే దూకి చచ్చిపోతున్నాయట. దీనికి కూడా వంతెన నిర్మాణంలో ఉన్న కారణాలే అయి ఉండవచ్చు అంటున్నారు సైకాలజిస్ట్  డాక్టర్ డెవిడ్ సాండ్స్.