Donald Trump China Virus : వుహాన్ ల్యాబ్‌లోనే కరోనావైరస్ పుట్టింది.. నేను చెప్పిందే నిజమైంది..

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనావైరస్ మహమ్మారి గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మానవాళిని వణికిస్తున్న కరోనా వైరస్‌ పుట్టుక గురించి తాను చెప్పిందే నిజమైందని డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు.

Donald Trump China Virus : వుహాన్ ల్యాబ్‌లోనే కరోనావైరస్ పుట్టింది.. నేను చెప్పిందే నిజమైంది..

Donald Trump China Virus

Updated On : June 4, 2021 / 1:47 PM IST

Donald Trump China Virus : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనావైరస్ మహమ్మారి గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మానవాళిని వణికిస్తున్న కరోనా వైరస్‌ పుట్టుక గురించి తాను చెప్పిందే నిజమైందని డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఆ వైరస్ చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌లోనే పుట్టిందని మరోసారి స్పష్టం చేశారు. కరోనా మూలాలపై పరిశోధనలపై స్పందించిన ట్రంప్.. బ్రిటన్ సహా చాలా అధ్యయనాలు తాను చెప్పిందే నిజమని రిపోర్టులు ఇస్తున్నాయని అన్నారు. ఇంతటి విధ్వంసం సృష్టించినందుకు యావత్‌ ప్రపంచానికి చైనా భారీ మూల్యం చెల్లించాలని.. ప్రపంచ దేశాలకు 10 లక్షల కోట్ల డాలర్లు చెల్లించాలని ట్రంప్ డిమాండ్ చేశారు.

కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తోంది. కానీ, దాని పుట్టుపూర్వోత్తరాలపై ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు. ఈ వైరస్‌ను చైనానే సృష్టించిందని, ఇది కుంగ్‌ ఫూ వైరస్‌ అని ట్రంప్‌ గతేడాదే ప్రకటించారు. అయితే ఆయన ఆరోపణలకు ఆధారాలు లేవని శాస్త్రవేత్తలతో పాటు అమెరికా గూఢఛారి సంస్థలూ పేర్కొన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ఓడిన తర్వాత ఈ విషయం తాత్కాలికంగా మరుగున పడినా.. ఇటీవల మళ్లీ చైనా కుట్రకోణం తెరపైకి వచ్చింది. ఈ వైరస్‌ చైనా సృష్టే అని, జీవాయుధంగా మార్చేందుకు డ్రాగన్‌ చేసిన పరిశోధనల ఫలితమే మహమ్మారి విలయమని ఇటీవల బ్రిటన్‌ సహా పలు అధ్యయనాలు తెలిపాయి.