అక్రమ వలసదారుల దిమ్మతిరిగిపోయేలా ప్లాన్ వేసిన డొనాల్డ్ ట్రంప్.. మనవాళ్ల పరిస్థితి ఏంటి?
ట్రంప్ తన మాటను నెగ్గించుకుంటున్నారు. అక్రమ వలసదారుల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Donald Trump
అక్రమ వలసలను అరికడతామని ఎన్నికల ప్రచారంలో హామీలు ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లే చర్యలు తీసుకుంటున్నారు. వీసా ముగిసినప్పటికీ అమెరికాలోనే ఉంటున్న వారిపై అమెరికా దృష్టి పెట్టింది.
ఇలా గడువు ముగిసినప్పటికీ 7,000 మంది ఇండియన్లు ఇంకా అమెరికాలోనే ఉన్నారని అమెరికా కాంగ్రెస్ ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీ దృష్టికి సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ తీసుకెళ్లింది. ఆ 7,000 మంది గతంలో విద్యార్థి వీసాలు, ఎక్స్‌చేంజ్ విజిటర్ వీసాలపై తమ దేశానికి వచ్చారని చెప్పింది.
గత ఏడాదే వీరందరి వీసాల గడువు ముగిసిందని తెలిపింది. వీసాల గడువు ముగిసిన వారిలో 2,000 మంది విద్యార్థులే ఉన్నట్లు చెప్పింది. భారత్‌తో పాటు బ్రెజిల్, చైనా, కొలంబియా నుంచి కూడా 2,000 మంది చొప్పున విద్యార్థులు వీసా గడువు ముగిసినప్పటికీ తమ దేశంలోనే ఉంటున్నట్లు తెలిపింది.
వీసాల దుర్వినియోగంతో పాటు నిబంధనల ఉల్లంఘనల వేళ తమ వ్యవస్థలో, చట్టాల్లో ప్రక్షాళన జరగాలని ఆ కమిటీ చెప్పింది. అలాగే, హెచ్-1బీ వీసా గడువును రెండేళ్లకు మాత్రమే నిర్ణయించాలని పేర్కొంది. అనంతరం ఆయా వ్యక్తుల అవసరాన్ని బట్టి నాలుగేళ్లకు పొడిగించేలా అవకాశం ఉండాలని చెప్పింది.
ధూమ్ సినిమాని మించిపోయారు కదరా.. కార్లు ఈ రేంజ్ లో చోరీ చేయడం మీరెప్పుడూ చూసి ఉండరు..
నిర్బంధ కేంద్రాన్ని విస్తరించాలని ఆదేశం
డాక్యుమెంట్లు లేని వలసదారులను క్యూబాలోని గ్వాంటనామో బేలోని నిర్బంధ కేంద్రానికి తరలించన్నట్లు ట్రంప్ తెలిపారు. మోబేలో 30,000 మంది పట్టే సామర్థ్యంతో వలసదారుల నిర్బంధ కేంద్రాన్ని విస్తరించాలని చెప్పారు.
వలసదారుల్లో కొందరు నేరస్తులున్నారని ట్రంప్ తెలిపారు. అటువంటి వారిని స్వదేశాలకు పంపినా మళ్లీ యూఎస్‌ఏకు వచ్చే అవకాశముందని అన్నారు. అందుకే వారిని వారి దేశాలకు పంపవద్దని వారిని గ్వాంటనామోకు పంపబోతున్నట్లు తెలిపారు.
క్యూబాలోని యూఎస్‌ఏ నావికాదళ స్థావరం సమీపంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. తమ దేశస్థులకు బెదిరిస్తున్న నేరగాళ్లను నిర్బంధ కేంద్రంలో బందిస్తామని తెలిపారు.
ఈ నిర్బంధ కేంద్ర విస్తరణకు ఎంత ఖర్చవుతుందన్న వివరాలను ఆయన చెప్పలేదు. అయితే, అమెరికా సర్కారు ప్లాన్లను క్యూబా ప్రభుత్వం ఖండించింది. ఆక్రమిత భూముల్లో బందీలను యూఎస్‌ఏ చిత్రహింసలు పెడుతోందని చెప్పింది.