ధూమ్ సినిమాని మించిపోయారు కదరా.. కార్లు ఈ రేంజ్ లో చోరీ చేయడం మీరెప్పుడూ చూసి ఉండరు..
పోలీసులు లొకేషన్‌ను ట్రాక్ చేస్తూ కంటైనర్‌ను తమ వాహనాల్లో వెంబడించి, చివరకు రావత్ కార్లతో వెళ్తున్న కంటైనర్‌ను ఆపారు.

కార్లను చోరీ చేసి అమ్మేయాలనుకుని ప్లాన్ వేశాడు ఓ కేటుగాడు. అందుకు ఓ ప్లాన్ వేసుకున్నాడు. ఆన్‌లైన్ కార్ రెంటల్ కంపెనీ జూమ్‌కార్ ద్వారా ఓ కారును, మరో రూపంలో మరో రెండు కార్లను అద్దెకు తీసుకున్నాడు.
ఆ కార్లను కంటైనర్‌లో ఉంచి రహదారిపై తీసుకెళ్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్‌లో కారును రెంట్‌కు తీసుకున్న ఆ కేటుగాడు దాన్ని కంటైనర్‌లో చెన్నై తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
Nagoba Jatara 2025: నాగోబా జాతరలో దర్బార్.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
హైదరాబాద్ వాసి చిట్టిప్రోలు ఉత్తేజ్ కార్లను రెంటుకు ఇస్తూ సంపాదిస్తుంటాడు. జూమ్‌యాప్ ద్వారా అతడి వద్ద గులాం మహమ్మద్ రావత్ అనే యువకుడు కారును రెంటుకు తీసుకున్నాడు.
కొన్ని గంటల తర్వాత రావత్‌కు ఉత్తేజ్ ఫోన్ చేశాడు. అయితే, రావత్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పెట్టుకోవడంతో ఉత్తేజ్‌కు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు జీపీఎస్ ద్వారా ఆ కారు ప్రకాశం జిల్లాలో జాతీయ రహదారిపై ఉన్నట్లు తెలుసుకున్నారు.
టంగుటూరు టోల్‌ప్లాజాకు దగ్గరలో ఆ కారు ఉన్నట్టు గుర్తించి, జాతీయ రహదారి మొబైల్ పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు లొకేషన్‌ను ట్రాక్ చేస్తూ కంటైనర్‌ను తమ వాహనాల్లో వెంబడించి, చివరకు రావత్ కార్లతో వెళ్తున్న కంటైనర్‌ను ఆపారు. దాని డోర్లు తీసి చూస్తే అందులో ఓ థార్ వాహనం, మరో రెండు కార్లు ఉన్నాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని కేసులో దర్యాప్తు చేస్తున్నారు.
Osmania Hospital: వందేళ్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఉస్మానియా ఆసుపత్రి