Trump Tariff: అన్నంత పని చేసిన ట్రంప్.. భారత్‌పై మరోసారి టారిఫ్‌లు విధింపు.. అప్పటి నుంచి అమల్లోకి..

ఇండియాతో వ్యాపారం కష్టంగా మారిందన్నారు. భారత్ తమకు మంచి భాగస్వామి కాదంటూ తన పైత్యాన్ని చూపించారు.

Trump Tariff: అన్నంత పని చేసిన ట్రంప్.. భారత్‌పై మరోసారి టారిఫ్‌లు విధింపు.. అప్పటి నుంచి అమల్లోకి..

US President Donald Trump

Updated On : August 6, 2025 / 8:14 PM IST

Trump Tariff: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. భారత్ పై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ టారిఫ్ బాంబ్ పేల్చేశారు. మరోసారి ఇండియాపై టారిఫ్ లు విధించారు. ఇండియాపై 25శాతం అదనపు టారిఫ్ లు విధించారు ట్రంప్. ఇప్పటికే 25శాతం టారిఫ్ ఉండగా, తాజా పెంపుతో భారత్ పై ట్రంప్ విధించిన టారిఫ్ ల శాతం 50శాతానికి పెరిగింది. ఇది ఇండియా బిజినెస్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. పెంచిన టారిఫ్ లు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి.

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోంది. దీనిపై ట్రంప్ సీరియస్ అయ్యారు. వెంటనే రష్యాతో చమురు కొనుగోళ్లు ఆపేయాలన్నారు. లేదంటే టారిఫ్ లు పెంచుతానని భారత్ ను బెదిరించారు. అలా వార్నింగ్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే టారిఫ్ లు పెంచేశారు ట్రంప్. ఇండియాతో వ్యాపారం కష్టంగా మారిందన్నారు. భారత్ తమకు మంచి భాగస్వామి కాదంటూ తన పైత్యాన్ని చూపించారు. అన్నట్లుగానే టారిఫ్ ల మోత మోగించారు. ఇండియా ఎదుగుదలను చూడలేక కొంతకాలంగా సుంకాలతో విరుచుకుపడుతున్నాడు ట్రంప్. సాకులు చూపుతూ టారిఫ్ లు విధిస్తున్నారు.

రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తూ యుక్రెయిన్ పై యుద్ధానికి పరోక్షంగా సాయం చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. అందుకే టారిఫ్స్ వేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకుముందే 25శాతం టారిఫ్ వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదనంగా 25శాతం టారిఫ్ వడ్డించారు.

Also Read: వాళ్ల జోలికి వెళ్లొద్దు.. భారత్‌పై ట్రంప్ సుంకాల పెంపు వ్యాఖ్యలు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నిక్కీ హెలీ..