బాడీ గార్డుతో దుబాయ్ రాజు మాజీ భార్య ప్రేమాయాణం, సీక్రెట్‌గా ఉంచాలని రూ.12కోట్లు భరణం

Princess: దుబాయ్ రాజు ఆరో భార్య.. యువరాణి హయా తన లవ్ అఫైర్ కప్పి పుచ్చుకునేందుకు రూ.12కోట్లు చెల్లించిందట. రెండేళ్ల పాటు బాడీ గార్డ్‌తో సాగించిన వ్యవహారాన్ని బయటకు చెప్పకూడదని అతనికి రూ.12కోట్లు ఇచ్చి నోరు మూయించింది. అంతే మొత్తాన్ని మిగిలిన ముగ్గురు ఫ్యామిలీ బాడీ గార్డ్స్ కు కూడా ఇచ్చిందట హయా.
అఫైర్ గురించి ఇతరులతో చర్చించకుండా పెద్ద మొత్తంలోనే ముట్టజెప్పిందని సమాచారం. జోర్డాన్ అనే రాజు కుమార్తె అయిన హయా.. 37ఏళ్ల రస్సెల్ ఫ్లవర్స్ అనే వ్యక్తికి లగ్జరీ ఐటెంలు గిఫ్ట్ ఇచ్చిందట. అందులో రూ.12లక్షల విలువైన వాచ్, రూ.49లక్షల విలువైన షాట్ గన్ కూడా ఉన్నాయి.
యువరాణి బిడ్డ సంరక్షించే బాధ్యత కోసం లండన్ హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఇది బయటపడింది. రస్సెల్ రాయల్ రెజిమెంట్‌కు ఐదేళ్ల పాటు పనిచేశాడు. 2016నుంచి పూర్తిగా రాయల్ ఫ్యామిలీతో పాటే ఉన్న రస్సెల్ చాలా సార్లు ఆమెతో పాటు విదేశీ ప్రయాణాలకు కూడా చెక్కేశాడు. వీళ్ల అఫైర్ వారి నాలుగేళ్ల వైవాహిక జీవితాన్ని ముగిసిపోయేలా చేసింది.
బాడీ గార్డుని ఎప్పుడూ తనతో పాటే తిప్పుకోవాలని ఆమె డబ్బు, గిఫ్టులు ఇస్తుండేదట. ఆమె యూకేలో ఉన్నప్పుడు ప్రతి రాత్రి అతనితో పాటు బయటకు వెళ్తుండేది. చాలా సార్లు తెల్లవారేంత వరకూ ఇంటికి తిరిగొచ్చే వాళ్లు కాదు’ అని ఒక బాడీగార్డు చెప్పాడు.
వారి రెండేళ్ల ప్రేమాయణం గురించి వచ్చిన రూమర్లను కొట్టిపారేసింది. తీరా ఆ విషయాన్ని భర్త నిలదీసేసరికి ఇద్దరు పిల్లలను తీసుకుని 2018లో లండన్ వెళ్లిపోయింది. ఆమె 11ఏళ్ల కూతురు, 7సంవత్సరాల కొడుకు సంరక్షణను తీసుకునే అంశాన్ని కోర్టులో గెలవగలిగింది. ప్రస్తుతం యువరాణి పిల్లలతో కలిసి లండన్ లోని రూ.850కోట్ల విలువైన ఇంట్లో ఉంటున్నారు.