Dubais Crown Prince : దుబాయ్ యువరాజుకు కవల పిల్లలు..పాప, బాబుల్ని చూసి మురిసిపోతున్న క్రౌన్ ప్రిన్స్

దుబాయి క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య సయిద్ బిన్ తానీ అల్ మక్తోమ్ కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ కవలపిల్లలో ఓ పాప,ఓ బాబు పుట్టారు. ఈ శుభవేళ ప్రిన్స్ కు అభినందలు వెల్లువెత్తుతున్నాయి.

Dubais Crown Prince : దుబాయ్ యువరాజుకు కవల పిల్లలు..పాప, బాబుల్ని చూసి మురిసిపోతున్న క్రౌన్ ప్రిన్స్

Dubais Crown Prince Twins

Updated On : May 23, 2021 / 6:02 PM IST

Dubais Crown Prince becomes a father welcomes twins : దుబాయి క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య సయిద్ బిన్ తానీ అల్ మక్తోమ్ కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ కవలపిల్లలో ఓ పాప,ఓ బాబు పుట్టారు. ఇద్దరు చిన్నారి దేవతలు తమ జీవితంలోకి వచ్చారని యువరాజు తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. అందాల యువరాజుకు పుట్టిన కవల పిల్లలు ముద్దులు మూటకట్టేలా ఉన్నారు. బిడ్డల ఇద్దరిని రెండు చేతుల్లోను పెట్టుుకుని వాత్సల్యంతో వారి వంకే చూస్తూ యువరాజు షేక్ హమ్దన్ బిన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో యువరాజు దంపతులకు శుభాకాంక్షల వర్షం వెల్లువెత్తింది.

దుబాయ్ ప్రభుత్వ అధికారిక మీడియా ఖలీజ్ టైమ్స్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. కవలల పేర్లు ఆ పిల్లలకు హమ్దన్ బిన్ మహ్మద్ అల్ మక్తోమ్, రషీద్ బిన్ హమ్దన్ అల్ మక్తోమ్ గా దుబాయ్ యువరాజు దంపతులు పేర్లు పెట్టారు. ఆడపిల్లకు తన తల్లి పేరును పెట్టగా, మగపిల్లాడికి షేక్ హమ్దన్ తాత అయిన దివంగత షేక్ రషీద్ బిన్ సయిద్ అల్ మక్తోమ్ పేరును నామకరణం చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రజలకు తెలియజేశారు. 2019తో యువరాజు వివాహం జరిగింది. యువరాజు భార్య సయిద్ బిన్ తానీ అల్ మక్తోమ్ గర్భిణి అనే విషయాన్ని వారి కుటుంబం రహస్యంగానే ఉంచారు.

కవల పిల్లలకు తండ్రి అయిన దుబాయ్ యువరాజుకు ఇతర రాజవంశాలకు చెందినవారు అభినందనలు చెబుతున్నారు. మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్, యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రితో పాటు దుబాయ్ షేక్ కుమారులైన షేక్ హమ్దన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్, షేక్ మహ్మద్ మక్తోమ్ బిన్ మహ్మద్, డిప్యూటీ రూలర్ ఆఫ్ దుబాయ్, షేక్ అహ్మద్ బిన్ మహ్మద్ లాంటి ప్రముఖులు దుబాయ్ యువరాజుకు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా దుబాయ్ యువరాజు సైకిల్ పై రోడ్డు మీదకు వచ్చి సందడి చేశారు. నిప్పుకోళ్లతో పందెం వేసిన వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. అంతేకాదు ఏకంగా తన కారులో గూడు పెట్టుకున్న పావురాల కోసం తన కారునే వదిలేశారు యువరాజు. యువరాజు రూ.2 కోట్ల రూపాయల ఖరీదుగల మెర్సిడెజ్ బెంజ్ MMG G26 కారులో ఓ పావురాల జంట గూడు పెట్టుకుంది. అది చూసిన ప్రిన్స్ వాటికి ఇబ్బంది కలుగకుండా పావురాల గుడ్లలోంచి పిల్లలు బైటకు వచ్చి ఎగిరిపోయేదాకా ఆ కారును అక్కడ నుంచి కదపలేదు. దాన్ని అక్కడనుంచి కదపకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాదు..వాటి సంరక్షణ కోసం ఏర్పాట్లు కూడా చేశారు.

యువరాజు ప్రకృతి ప్రేమికుడని సన్నిహితులు చెప్పుతుంటారు.అందుకే ఆయన్ని ముద్దుగా ‘ఫజ్జా’ అని పిలుచుకుంటారట. ‘ఫజ్జా’అంటే అరబ్బీ భాషలో సహాయం చేసే వ్యక్తి అని అర్థం. మరి నిజంగానే యువరాజుకు ఆ పేరు చాలా చక్కగా సూట్ అయ్యింది కదూ..