Earthquake : ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లో భూకంపం
ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో గురువారం భూకంపం సంభవించింది. గురువారం ఉదయం ఏడున్నర గంటలకు ఇండోనేషియాలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది....

Earthquake
Earthquake : ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో గురువారం భూకంపం సంభవించింది. గురువారం ఉదయం ఏడున్నర గంటలకు ఇండోనేషియాలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. (Earthquake) 90.5 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. మాలూకు ప్రావిన్సులోని కేఈ దీవుల పరిధిలో ఉన్న ట్యూల్ నగరంలో భూకంపం వచ్చింది. భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లకు కేంద్రమైన ఇండోనేషియాలో తరచూ భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి.
Cloudburst : హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బరస్ట్…ఉత్తరాఖండ్‌లో 9మంది మృతి
ప్రపంచంలో 90 శాతం భూకంపాలు ఇండోనేషియాలోనే వస్తున్నాయి. (Indonesia, Philippines) ఫిలిప్పీన్స్ దేశంలోని సారంగగని ప్రాంతంలో గురువారం భూకంపం వచ్చింది. ఫిలిప్పీన్స్ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7 గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సోక్స్ సర్జెన్ ప్రాంతంలో సారంగగని ప్రాంతంలో సంభవించిన భూకంపంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఈ భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు.