intelligent elephant : అరటిపండు తొక్క వొలిచి తింటున్న ఏనుగు వీడియో వైరల్

జంతువులకి మనం ఏదైనా నేర్పాలే కానీ తెలివిగా నేర్చేసుకుంటాయి. ఓ ఏనుగు అచ్చంగా మనుష్యుల్లాగే అరటిపండు తొక్క వొలుచుకుని తింటోంది. ఆ వీడియో చూసిన జనం తెలివైన ఏనుగు అని కితాబు ఇస్తున్నారు.

intelligent elephant : అరటిపండు తొక్క వొలిచి తింటున్న ఏనుగు వీడియో వైరల్

intelligent elephant

Updated On : April 12, 2023 / 4:25 PM IST

intelligent elephant : ఒక్కోసారి జంతువులు చేసే చిత్రమైన పనులు భలే అనిపిస్తాయి. మనం అరటిపండు (banana) తొక్క వొలుచుకుని తింటాం. ఓ ఏనుగు (elephant) కూడా సేమ్ టూ టేమ్ అరటిపండు తొక్క వొలుచుకుని తింది. ఆశ్చర్యంగా ఉందా? నమ్మకపోతే ఈ స్టోరీ చదవండి.

New York metro : మెట్రోలో పరుపు వేసుకుని పడుకున్న వ్యక్తి వీడియో వైరల్

ఏనుగులు ఎక్కువగా జూలలో , అరణ్యాలలో ఉంటాయి. అయితే ఆలయాల వద్ద కూడా ఏనుగులు కనిపిస్తాయి. అవి కనిపించగానే జనం వాటికి ఏదో ఒకటి తినింపించాలని ప్రయత్నం చేస్తారు. దాని తొండంతో ఆశీర్వాదం తీసుకోవాలని కూడా భావిస్తారు. ఇదంతా సరే కానీ.. ఏనుగులకి అరటిపండ్లు ఇస్తే తొక్కతోపాటు తినడం మనం చూసి ఉంటాం. కానీ పాంగ్ ఫా (Pang Pha) అనే ఓ ఏనుగు అరటిపండును చక్కగా వొలుచుకుని తింటుంది. అదీ పసుపు, గోధుమరంగు అరటిపండ్లు ఇచ్చినప్పుడు మాత్రమే. బెర్లిన్ జూలో (Berlin zoo) ఇలా అరటిపండు వొలుచుకుని తినడం నేర్చుకుందట పాంగ్ ఫా .. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. జనం దాన్ని చూసి ముచ్చటపడుతున్నారు.

bull attack : మహిళపై ఎద్దు దాడి.. ప్రాణాలకు తెగించి కాపాడిన బాలుడి వీడియో వైరల్

తెలివైన ఏనుగు అని కొందరు.. వీడియో అద్భుతంగా ఉందని కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఓ డాగ్ చదివినది చేసి చూపిస్తోందనే వీడియో ఈ మధ్యనే వైరల్ అయ్యింది.. ఇప్పుడు ఈ వీడియో. మొత్తానికి మనుష్యులతో పాటు జంతువులు కూడా తాము చేసే అద్భుతాలతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి.