Elon Musk: పేరు మార్చుకున్న ఎలన్ మస్క్
టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ తన పేరును మార్చేసుకున్నారు. Elon Musk అన్న పేరులో A అనే అక్షరం జోడించి Elona Musk అయ్యారు.

Elon Musk
Tesla CEO Elon Musk: టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ తన పేరును మార్చేసుకున్నారు. Elon Musk అన్న పేరులో A అనే అక్షరం జోడించి Elona Musk అయ్యారు.
రష్యా(Russia) – ఉక్రెయిన్(Ukraine) మధ్య కొనసాగుతున్న యుద్ధం గురించి మస్క్ సోమవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin)కు ట్వీట్ చేయడంతో పేరులోని మార్పు వెలుగులోకి వచ్చింది.
రెండు దేశాల మధ్య భీకర పోరు 21రోజులుగా కొనసాగుతుండటంతో తనతో పోరాడేందుకు రమ్మంటూ సవాల్ విసిరారు. ట్విటర్ వేదికగా పుతిన్‌ను ఛాలెంజ్ చేశారు ఎలన్ మస్క్.
Read Also: యుక్రెయిన్ కు ఇంటర్నెట్ సదుపాయం అందించిన ఎలాన్ మస్క్
‘నాతో పోరాడేందుకు వ్లాదిమిర్ పుతిన్‌కు సవాలు విసురుతున్నా’ అంటూ రష్యా అధ్యక్ష భవనాన్ని ట్యాగ్ చేశారు. రష్యా వర్ణమాలలోనే పుతిన్ పేరును రాసుకొచ్చారు. ఈ పోరులో గెలిచినవారే ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగాలా, ఆగిపోవాలా నిర్ణయిస్తారు అని అర్థం వచ్చేలా ‘ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు’ అని ట్వీట్‌లో ప్రస్తావించారు.
దీనిపై రష్యా స్పేస్ ప్రోగ్రామ్ డైరెక్టర్ జనరల్ ఘాటుగా స్పందించారు. అలా వీరిద్దరి మధ్య ట్విటర్‌లో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
చెచెన్యా నాయకుడు రంజాన్ కదిరోవ్ కూడా ఈ గొడవలోకి దూరి.. మస్క్‌ను ఎగతాళి చేశాడు. ఎలన్ మస్క్‌ని ఎలియోనా అని సరదాగా పిలిచాడు. దాని ఫలితంగానే మస్క్ తన పేరును ట్విట్టర్‌లో మార్చుకోవాల్సి వచ్చింది.
Read Also : మాటంటే.. మాటే.. ఎలాన్ మస్క్ మాటిచ్చాడు.. నిలబెట్టుకున్నాడు..!