Musk vs Zuck: ఫేస్‭బుక్ బాస్ జూకర్‌బర్గ్‭తో కేజ్ ఫైట్ ప్రకటించిన మస్క్.. ట్విటర్‭లో లైవ్ వస్తుందట

జూకర్‌బర్గ్ స్పందిస్తూ.. ఆయన గెలిచిన మ్యాచ్‌ల ఫోటోలను పోస్ట్ చేసి ప్రతిపాదిత త్రోడౌన్ కోసం లొకేషన్‌ను పంపమని మస్క్‭ని అడిగారు. దానిపై మస్క్ స్పందిస్తూ.. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) ఛాంపియన్‌షిప్ బౌట్‌లు జరిగే ఈవెంట్ సెంటర్ ని సూచించారు

Musk vs Zuck: ఫేస్‭బుక్ బాస్ జూకర్‌బర్గ్‭తో కేజ్ ఫైట్ ప్రకటించిన మస్క్.. ట్విటర్‭లో లైవ్ వస్తుందట

Cage Fight: కేజ్ ఫైటింగ్ గురించి తెలుసు కదా.. ఇద్దరు ఫైటర్లను ఒక కేజ్‭లో వేస్తారు, అనంతరం వారు కొట్టుకుంటారు. కాగా, ఈ ఫైట్ చోసం ప్రొఫెనల్ ఫైటర్లు ఉంటారు. కానీ ఈ ఫైట్ కోసం ప్రపంచంలోని అత్యంత ధనవంతులు పోటీ పడుతున్నారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ X (ట్విట్టర్) యజమాని ఎలోన్ మస్క్, టెక్ కంపెనీ మెటా సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ మధ్య చాలా కాలంగా కేజ్ ఫైట్ గురించి చర్చ జరుగుతోంది. దీనికి అనుగుణంగానే జూకర్‌బర్గ్, తనకు మధ్య కేజ్ ఫైట్ ఉండబోతోందని, పోరాటానికి సంబంధించిన లైవ్ స్ట్రీమింగ్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఉంటుందని పేర్కొన్నారు. అయితే దీనిపై ఫేస్‌బుక్ నుంచి కానీ ఇన్‌స్టాగ్రామ్ నుంచి జుకర్‌బర్గ్ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

Uttar Pradesh: మనుషులు మరీ ఇలా ఎలా ఉంటారు? చిన్నపిల్లల చేత మూత్రం తాగించి, వారి జననాంగాల్లో కారం చల్లారు

ఇక, దీనికి వచ్చిన ఆదాయాన్ని స్వచ్ఛంద సంస్థకు ఇవ్వనున్నట్లు మస్క్ ప్రకటించారు. ఆదివారం ఉదయం X పోస్ట్‌లో మరిన్ని ‘‘జుక్ vs మస్క్ ఫైట్ (మార్క్ జూకర్‌బర్గ్‌తో ఎలాన్ మస్క్ కేజ్ ఫైట్) Xలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని స్వచ్ఛంద సంస్థలకు అందజేస్తారు’’ అని ట్వీట్ చేశారు. అంతకుముందు ఆదివారం X లో మస్క్ మాట్లాడుతూ, తాను రోజంతా బరువులు ఎత్తుతున్నానని, పోరాటానికి సిద్ధమవుతున్నానని చెప్పారు. వర్కవుట్ చేయడానికి తనకు సమయం దొరకడం లేదని, అందుకే బరువులు తీసుకుని పని చేస్తున్నానని చెప్పారు.

Maharashtra Politics: శరద్ పవార్‭కు మరో ఎదురుదెబ్బ.. అజిత్ పవార్ బాటలో జయంత్ పాటిల్.. బీజేపీలోకి వెళ్లడం ఖాయమట!

దీనికి ముందు ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో కొంత వార్ కొనసాగింది. X లోని ఒక వినియోగదారు ఇద్దరి మధ్య పోరాట సమస్య గురించి మస్క్‌ను అడిగినప్పుడు, ఇది పోరాటానికి సంబంధించిన నాగరిక రూపమని, పురుషులు యుద్ధాన్ని ఇష్టపడతారని వ్యాఖ్యానించారు. జియుజిట్సులో శిక్షణ పొందుతున్న జూకర్‌బర్గ్‌తో కేజ్ మ్యాచ్‌కు తాను సిద్ధమని జూన్ 20న మస్క్ పోస్ట్‌ ద్వారా చెప్పడంతో వివాదం మొదలైంది.

Alex Steele : క్రికెట్ అంటే పిచ్చి.. 83 ఏళ్ల వ‌య‌సులో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ పెట్టుకుని మ‌రీ వికెట్ కీపింగ్‌..

ఇక, ఒక రోజు అనంతరం తన కంపెనీ ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా జూకర్‌బర్గ్ స్పందిస్తూ.. ఆయన గెలిచిన మ్యాచ్‌ల ఫోటోలను పోస్ట్ చేసి ప్రతిపాదిత త్రోడౌన్ కోసం లొకేషన్‌ను పంపమని మస్క్‭ని అడిగారు. దానిపై మస్క్ స్పందిస్తూ.. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) ఛాంపియన్‌షిప్ బౌట్‌లు జరిగే ఈవెంట్ సెంటర్ ని సూచించారు. ఇక వీరిమధ్య ఫైట్ కోసం చాలా మంది కృషి చేస్తున్నారట. అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్ (యూఎఫ్‌సీ)కి చెందిన డానా వైట్ మాట్లాడుతూ.. మస్క్, జుకర్‌బర్గ్ మధ్య నిజమైన పోరాటం జరగడానికి తాను కృషి చేస్తున్నానని, ప్రపంచ చరిత్రలో ఇదే అతిపెద్ద పోరాటమని ఆయన జోస్యం చెప్తున్నారు. ఇది ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.