అంతరిక్షంలో ఇంధనం
అంతరిక్ష వాతావరణంలోనూ ఇంధన వనరులు లభించే అవకాశమున్నట్లు తాజా పరిశోధనలో తేలింది.

అంతరిక్ష వాతావరణంలోనూ ఇంధన వనరులు లభించే అవకాశమున్నట్లు తాజా పరిశోధనలో తేలింది.
చెన్నై: భూమి మీదే కాదు ఇక అంతరిక్షంలోనూ ఇంధనం లభించనుంది. అంతరిక్ష వాతావరణంలోనూ ఇంధన వనరులు లభించే అవకాశమున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. నక్షత్ర మండలాల అంచుల్లోని అతిశీతల శూన్య పరిస్థితులను ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించి.. ‘క్లాత్రేట్ హైడ్రేట్స్’ అణువులు ఏర్పడటాన్ని ఐఐటీ-మద్రాస్ శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని వారు ‘అంతరిక్ష ఇంధనం’గా పిలుస్తున్నారు. మీథేన్ వంటి వాయువులను కలిగిన నీటి అణువులను క్లాత్రేట్ హైడ్రేట్స్ అంటారు. భవిష్యత్తు తరం ఇంధన వనరులు ఇవేనని అంచనాలు వేస్తున్నారు. అత్యధిక పీడనం ఉండే సముద్రపు అడుగు ప్రాంతంలో, మట్టి గడ్డకట్టుకుపోయి ఏర్పడే పర్మాఫ్రోస్ట్ నేలల్లో ఇవి లభిస్తాయి. విశ్వంలో సుదూరంగా ఉన్న శూన్య ప్రాంతాల్లోనూ ఇవి ఏర్పడతాయని ఐఐటీ-మద్రాస్ ప్రొఫెసర్ ప్రదీప్ వెల్లడించారు.