Sandwich Bag : ఈ బ్యాగ్ ధర అక్షరాలా రూ.2.8 లక్షలు.. అంత ధర ఎందుకంటే?

కొన్ని బ్రాండెడ్ కంపెనీలు తయారు చేసే వస్తువుల ఖరీదు వింటే ఖంగు తింటూ ఉంటాం. తాజాగా శాండ్‌విచ్ బ్యాగ్ అని వైరల్ అవుతోంది. దాని ఖరీదు వింటే షాకవుతారు.

Sandwich Bag : ఈ బ్యాగ్ ధర అక్షరాలా రూ.2.8 లక్షలు.. అంత ధర ఎందుకంటే?

Sandwich Bag

Sandwich Bag : ఫ్యాషన్ వరల్డ్‌లో రకరకాల బ్రాండ్స్ తమ వస్తువుల్ని లాంచ్ చేస్తుంటాయి. అందులో కొన్ని అతి ఖరీదైనవి ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోతున్న బ్యాగ్ ధర అక్షరాల రూ.2,80,000. అంత ఖరీదా? అని మీరు ఆశ్చర్యపోయినా నిజం.

2023 Yamaha Bikes Launch : యువత కోసం భారత్‌కు యమహా స్పోర్ట్స్ బైకులు వచ్చేశాయి.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతో తెలుసా?

కొన్ని రకాల బ్రాండ్లతో మార్కెట్లో కనిపించే వస్తువుల ఖరీదుని చూస్తే ఖంగు తింటాం. అలా కొత్తగా మార్కెట్లోకి ఓ బ్యాగు వచ్చింది. అదే లూయిస్ విట్టన్ శాండ్‌విచ్ బ్యాగ్. ప్రముఖ ఫ్రెంచ్ కంపెనీ లూయిస్ విట్టన్ ఈ బ్యాగ్‌ను జనవరి 4 న మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర విని ఇప్పుడు అంతా షాకవుతున్నారు.. అక్షరాలా రూ.2,80,000 పలుకుతోంది. శాండ్‌విచెస్ లేదా ఇతర వస్తువులు పెట్టుకునే విధంగా దీనిని తయారు చేసారు. బ్లూ కలర్ జిప్‌తో ఉన్న ఈ బ్యాగ్‌లో లోపల రెండు అరలు ఉంటాయి. మైసన్ ఫోండీ ఎన్ 1854 అనే అక్షరాలు కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ బ్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Mumbai : రూ.116 కోట్ల ఖరీదైన అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన ఫ్యాషన్ డిజైనర్..

ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ క్రియేటివ్ డైరెక్టర్ ఫారెల్ విలియమ్స్ ఈ బ్యాగ్ డిజైన్ చేసారు. 30 సెంటీమీటర్ల పొడవు, 17 సెంటీమీటర్ల వెడల్పు, 27 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉంది ఈ శాండ్‌విచ్ బ్యాగ్. లూయిస్ విట్టన్ సంస్థ గతంలో  విమానం ఆకారంలో ఉండే బ్యాగ్ ను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. $39000 (ఇండియన్ కరెన్సీలో అక్షరాల రూ.28 లక్షలు) ల విలువ చేసే ఆ బ్యాగ్ ధర విని అప్పట్లో అందరూ నోరెళ్లబెట్టారు. ఇంకా పొటేటో చిప్స్ బ్యాగు అంటూ రూ.1.24 లక్షలు విలువ చేసే మరో బ్యాగును సైతం గతంలో ఈ కంపెనీ పరిచయం చేసింది. కొన్ని బ్రాండ్స్ అంతే. వాటి ప్రత్యేకతలు ఏమీ లేకపోయినా ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతుంటాయి. బ్రాండ్స్ అంటే క్రేజ్ ఉన్నవాళ్లు ఇలాంటి వాటి మీద మోజు పడుతుంటారు.