Pakistan : బ్రేకింగ్ న్యూస్, కరాచీలో పేలుడు..10 మంది మృతి
కరాచీలో పేలుడు ఘటన కలకలం రేపుతోంది. ఈ పేలుడు ధాటికి 10 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.

Karachi
Explosion in Karachi : పాక్ దేశంలోని కరాచీలో పేలుడు ఘటన కలకలం రేపుతోంది. ఈ పేలుడు ధాటికి 10 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ పేలుడు ధాటికి భవనాలు ధ్వంసమయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. పరచా చౌక్ ఏరియాలో 2021, డిసెంబర్ 18వ తేదీ శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 12 మందికి గాయాలైనట్లు..వీరిలో కొంతమంది పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.
Read More : Rahul gandhi in UP : మోడీ నియంతృత్వ నిర్ణయాలతో ప్రజలు చస్తూ జీవిస్తున్నారు : రాహుల్ గాంధీ
ఈ ప్రాంతంలో గ్యాస్ పైపులైన్ వెళుతోందని..అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో భవనానికి అపారనష్టం వాటిల్లిందని పోలీసులు వెల్లడిస్తున్నట్లు సమాచారం. రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవన శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా ? అనేది తెలియరావడం లేదు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుని ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. శిథిలాలను తొలగించి..చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read More : Pakistan : బ్రేకింగ్ న్యూస్, కరాచీలో పేలుడు..10 మంది మృతి
బాంబు డిస్పోజల్ యూనిట్ చేరుకుని..ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. భవనంలో బ్యాంకు ఉందని, త్వరలోనే కొత్త ప్రాంతానికి తరలించనున్నారని అంతలో పేలుడు ఘటన జరగడం దురదృష్టకరమంటున్నారు. పేలుడుపై సీఎం సింధ్ మురాద్ ఆలీ షా స్పందించారు. పేలుడు ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కమిషనర్ ను ఆదేశించారు. పేలుడులో ప్రాణనష్టం సంభవించడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించే విధంగా చూడాలని ఆరోగ్య శాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.