Rahul gandhi in UP : మోడీ నియంతృత్వ నిర్ణయాలతో ప్రజలు చస్తూ జీవిస్తున్నారు : రాహుల్ గాంధీ

యూపీలోని అమేథీలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై మరోసారి విమర్శలు సంధించారు. మోడీ నియంతృత్వ నిర్ణయాలతో ప్రజలు చస్తూ జీవిస్తున్నారని విమర్శించారు.

Rahul gandhi in UP : మోడీ నియంతృత్వ నిర్ణయాలతో ప్రజలు చస్తూ జీవిస్తున్నారు : రాహుల్ గాంధీ

Rahul Gandhi In Up

Rahul gandhi in UP : ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల వేడి మాంచి కాకమీదుంది. బీజేపీ మళ్లీ అధికారం కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. మరోపక్క కాంగ్రెస్ గెలుపు కోసం..ఇంకోపక్క సమాజ్ వాదీ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని ఇలా ఏపార్టీకి ఆ పార్టీయే వరుస ర్యాలీలు..సభలతో హోరెత్తిస్తున్నాయి. జోరుగా అధికార, ప్రతిపక్షాల సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ యూపీలో పర్యటిస్తున్నారు.

రాహుల్ గాంధీ త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన అమేథీ వేదిక‌గా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. విమర్శలతో మోడీని తూర్పురా బ‌ట్టారు. ప్రధాని మోడీ అనుస‌రిస్తున్న విధానాల వ‌ల్ల దేశంలోని మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు దుర్భ‌ర జీవితాన్ని అనుభ‌విస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ నియోజకవర్గం నుంచి అమేథీ ప్రజలు నన్ను పార్లమెంట్ కు పంపించారని..తనపైనా కాంగ్రెస్ పార్టీ పైనా అమేథీ ప్రజలు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు అని రాహులు అన్నారు.

Read more :Jharkhand : స్టేజ్‌‌పై యువ రెజ్లర్‌‌ను కొట్టిన ఎంపీ

ప్రధాని మోడీ నియంతృత్వ నిర్ణయాలతో ప్రజలు ఛస్తూ బ్రతుకుతున్నారని అయినా ఆయనకు అవేమీ పట్టవని కానీ..గంగానదిలో మునగటానికి అస్తమాను యూపీ వస్తారని..కానీ ఇక్కడి ప్రజల కష్టాలు మాత్రం ఆయనకు పట్టవని విమర్శలు సంధించారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని..కోవిడ్ సమయంలో కేంద్రం సహాయం చేయడంలో విఫలమైందని విమర్శించారు. పెద్ద నోట్ల ర‌ద్దు, జీఎస్టీ విధానాన్ని అనాలోచితంగా నిర్ణయించి ప్రజల్ని రోడ్డున పడేసిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. క‌రోనా క్లిష్ట స‌మ‌యంలో మొండి చేయి చూప‌డం… వీటి వ‌ల్ల పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల జీవ‌నం అత‌లాకుత‌ల‌మైంద‌ని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం తాండ‌వం చేస్తున్నా..ప్ర‌ధాని మోదీ మాత్రం నోరు విప్ప‌ర‌ని..వార‌ణాసిలోని గంగాన‌దిలో మునిగి మాయమాటలు వల్లె వేయటంలో మాత్రం మోడీ దిట్ట అని రాహుల్ ఎద్దేవా చేశారు.

సాగు చ‌ట్టాలు ప్ర‌జ‌ల మేలు కోస‌మే అంటూ న‌మ్మించార‌ని.. ఆ త‌ర్వాత వాటిని రద్దు చేసి ప్ర‌జ‌ల‌ కోసమే ఈ చట్టాలు తెచ్చామని కానీ రైతులకు నష్టం కలిగించే ఏ చర్యలు బీజేపీ ప్రభుత్వం తీసుకోదు అంటూ ఏడాదికాలంగా రైతులు నిరసనలు చేయటంతో వేరే దారి లేక రాజకీయ లబ్ది కోసమే చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని..ప్రజలకు క్ష‌మాప‌ణ‌లు కోరారని రాహుల్ ఎద్దేవా చేశారు. అమేథీ ప్ర‌జ‌లు రాజ‌కీయాల విష‌యంలో త‌న‌కు చాలా విష‌యాలు నేర్పార‌ని.. అమేథీ నుంచే మొట్ట మొద‌టి సారిగా తాను ఎన్నిక‌ల గోదాలోకి వచ్చానని రాహుల్ ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు.

Read more :Bharathiyar Statue : 482 కిలోల చాక్లెట్‌తో 6.6 అడుగుల మహాకవి భారతియార్‌ విగ్రహం

కాగా రాహుల్ గాంధీ..దాదాపు రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాతత‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన అమేధీలో అడుగుపెట్టారు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆయ‌న అమేథీ, కేరళలోని వ‌య‌నాడ్ రెండు చోట్ల నుంచీ ఎంపీగా బ‌రిలోకి దిగారు. అమేథీలో ప్ర‌త్య‌ర్థి, బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. కానీ వ‌య‌నాడ్ నుంచి మాత్రం బంప‌ర్ ఓట్ల‌తో ఘన విజ‌యం సాధించారు. అప్ప‌టి నుంచి రాహుల్ అమేథీకి రానేలేదు. దాదాపు రెండు సంవ‌త్స‌రాల తర్వాత యూపీ ఎన్నికల నేపథ్యంలో అమేధీలో ప‌ర్య‌టిస్తున్నారు.