Bharathiyar Statue : 482 కిలోల చాక్లెట్‌తో 6.6 అడుగుల మహాకవి భారతియార్‌ విగ్రహం

తమిళ మహాకవి భారతియార్‌ను గౌరవించేలా పుదుచ్చేరిలోని ఓ బేకరీ నిర్వాహకులు 482 కిలోల చాక్లెట్‌తో 6.6 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 482 కిలోల చాక్లెట్‌తో నిర్మించింది.

Bharathiyar Statue : 482 కిలోల చాక్లెట్‌తో 6.6 అడుగుల మహాకవి భారతియార్‌ విగ్రహం

Zuka Chocolates Mahakavi Bharathiyar Statue

ZUKA Chocolates mahakavi bharathiyar statue : తమిళ మహాకవి భారతియార్‌ను గౌరవించేలా పుదుచ్చేరిలోని ఓ బేకరీ నిర్వాహకులు 482 కిలోల చాక్లెట్‌తో ఆయనకు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కవి, పాత్రికేయుడు, భారత స్వాతంత్ర్య కార్యకర్త, సంఘ సంస్కర్త,బహుభాషావేత్త మహాకవి భారతిగా ప్రసిద్ధి చెందిన అతను ఆధునిక తమిళ కవిత్వానికి మార్గదర్శకుడు మరియు ఎప్పటికప్పుడు గొప్ప తమిళ సాహిత్యవేత్తలలో ఒకరిగా పరిగణించబడ్డారు ఆయన. ఆయన విగ్రహాన్ని 482 కిలోల చాక్లెట్‌తో నిర్మించింది జుకా బేకరి.

Read more : Agni Prime : జయహో భారత్, అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్..ప్రత్యేకతలు

పుదుచ్చేరిలోని మిషన్‌ వీధిలోని జుకా బేకరీలో గతంలో గాంధీ, రజనీకాంత్, అబ్దుల్‌ కలాం తదితరుల విగ్రహాలను ఇలా రూపొందించారు. ప్రస్తుతం 482 కిలోల చాక్లెట్‌తో 6.6 అడుగుల ఎత్తైన భారతియార్‌ విగ్రహాన్ని రూపొందించారు. భారతియార్‌ వ్యాఖ్యలైన ‘నాన్‌ విళువేన్‌ ఎండ్రు నినైత్తాయో’ (నేను పడతానని భావించావో) అనే వ్యాఖ్యలను ఆయన చేతిలోని పుస్తకంపై రాశారు. దీనిని తయారు చేయడానికి 160 గంటలు పట్టిందని నిర్వాహకులు తెలిపారు. దీని కోసం ముగ్గురు శ్రమించారని పేర్కొన్నారు. వినియోగదారులను ఆకర్షించేలా కొన్నాళ్లపాటు ప్రదర్శనకు ఉంచుతామని వివరించారు.

దీనిపై జుకా బేకరీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనాథ్ బాలచంద్రన్ మాట్లాడుతు..ప్రతి సంవత్సరం డిసెంబర్‌లో..ప్రముఖ వ్యక్తుల విగ్రహాన్ని తయారు చేస్తామని..గత కొంతకాలంగా భారతియార్ విగ్రహాన్ని రూపొందించాలని అనుకుంటున్నాం. ఈ సంవత్సరం మహాకవి భారతియార్ 139వ జయంతి సందర్భం..ఆయన మరణించి 100 సంవత్సరాలు అవుతున్నందున మా 40వ చాక్లెట్ సృష్టిని సాహిత్య దిగ్గజానికి అంకితం చేయాలనుకుంటున్నాము”అని తెలిపారు. 1 డిసెంబర్ 1882

Read more : Uttar Pradesh IT Raids : యూపీలో ఐటీ దాడులు.. మాజీ సీఎం అఖిలేశ్‌ సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు

కాగా ఈ బేకరి దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, నటుడు రజనీకాంత్, హాస్య నటుడు చార్లీ చాప్లిన్, భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ,భారత ఫైటర్ పైలట్ అభినందన్ వర్థమాన్ వంటి వ్యక్తుల జీవిత-పరిమాణ చాక్లెట్ విగ్రహాలను రూపొందించింది.

మహా కవి భారతీయార్ అసలు పేరు సుబ్రమణ్య భారతి. ఈయన్ని ఇంకా భారతి , సుబ్బయ్య, శక్తి దాసన్, మహాకవి , ముండాసు కవిఘ్నర్, వీర కవి , సెల్లి దాసన్ అని పిలిచేవారు. ఆయన రచనలలో భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో దేశభక్తిని రగిలించే ఆవేశపూరిత పాటలు ఉన్నాయి. స్త్రీల విముక్తి కోసం.. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడారు. 14 భాషలలో ప్రావీణ్యం కలిగిన బహుభాషా కోవిదుడు సుబ్రమణ్య భారతి.

Read more : Madhya Pradesh : విద్యార్థిని ఫిర్యాదు.. టాయిలెట్లు కడిగిన మంత్రి

ఎట్టయపురం గ్రామంలో చిన్నస్వామి సుబ్రమణ్య అయ్యర్ మరియు లక్ష్మీ అమ్మాళ్ దంపతులకు జన్మించారు. మహాకవి భారతి అసలు పేరు సుబ్రమణ్య భారతి. తిరునెల్వేలిలోని MDT హిందూ కళాశాలలో చదవుకున్నారు. చిన్నప్పటి నుండే సంగీత, కవిత్వం పట్ల మక్కువపెంచుకున్నారు. భారతి ఐదేళ్ల వయసులో తన తల్లిని కోల్పోయారు. 16 ఏళ్లకే తండ్రిని కోల్పోయారు. ఇంగ్లీష్ నేర్చుకుని, అంకగణితంలో రాణించి, ఇంజనీర్ కావాలని ఆకాంక్షారు. ప్రావీణ్యం ఉన్న భాషావేత్తగా భారతి సంస్కృతం, హిందీ, తెలుగు, ఆంగ్లం, ఫ్రెంచ్ భాషలలో చక్కటి నేర్పు సంపాదించారు.అరబిక్ భాషలో అవపోసన పట్టారు. ఇన్ని భాషల్లో చక్కటి ప్రావీణ్యం సంపాదించనందుకు ఆయన 11 సంవత్సరాల వయస్సులో సరస్వతి అనుగ్రహించిన “భారతి” అనే బిరుదు లభించింది. తండ్రి చనిపోక ముందే భారతి 15 ఏళ్ల వయస్సులోనే ఏడేళ్ల చెల్లమ్మను వివాహం చేసుకున్నారు.

 

View this post on Instagram

 

A post shared by ZUKA (@zukachocolates)