Agni Prime : జయహో భారత్, అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్..ప్రత్యేకతలు

అత్యంత కచ్చితత్వంతో టార్గెట్ రీచ్ చేస్తుంది. రైల్, రోడ్ ఎక్కడినుంచైనా..అగ్ని ప్రైమ్ ను ప్రయోగించే వీలుంది....

Agni Prime : జయహో భారత్, అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్..ప్రత్యేకతలు

Agni

Agni Prime Missile : క్షిపణి ప్రయోగాల్లో భారత్ దూకుడును ప్రదర్శిస్తోంది. డిసెంబర్ 07వ తేదీన బ్రహ్మోస్ ను డీఆర్డీవో ప్రయోగించిన సంగతి తెలిసిందే. తాజాగా..అగ్ని ప్రైమ్ క్షిపణిని సక్సెస్ ఫుల్ గా ప్రయోగించింది. 2021, డిసెంబర్ 18వ తేదీ శనివారం ఒడిశాలోని బాలాసోర్ లో DRDO జరిపిన ఈ పరీక్ష సక్సెస్ అయ్యింది. ఉదయం 11.06 నిమిషాలకు ఈ పరీక్ష చేపట్టింది. అగ్నికి అడ్వాన్స్ డ్ వర్షన్ అగ్ని ప్రైమ్ అని, అగ్ని – 3 కంటే 50 శాతం బరువు తక్కువగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ క్షిపణిని త్వరలోనే సైన్యానికి అప్పగించనున్నారు. అగ్ని క్లాస్ కు చెందిన ఈ క్షిపణిలో అనేక కొత్త ఫీచర్లను జోడించారు.

Read More : Uttar Pradesh IT Raids : యూపీలో ఐటీ దాడులు.. మాజీ సీఎం అఖిలేశ్‌ సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు

అత్యంత కచ్చితత్వంతో టార్గెట్ రీచ్ చేస్తుంది. రైల్, రోడ్ ఎక్కడినుంచైనా..అగ్ని ప్రైమ్ ను ప్రయోగించే వీలుంది. దేశంలో ఏ మూలకైనా దీనిని సులభంగా తీసుకెళ్లే అవకాశం ఉంది. తక్కువ సమయంలోనే ప్రయోగానికి సిద్ధం చేయవచ్చు. ఈ సంవత్సరం జూన్ 28వ తేదీన అగ్ని ప్రైమ్ పరీక్ష నిర్వహించారు. దీనిని మరింత అభివృద్ధి పరిచి మరోసారి టెస్టు నిర్వహించారు. డ్యుయల్ నావిగేషన్, గైడెన్స్ వ్యవస్థ ఉంది. సుమారు 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలన్ని చేధించే సామర్థ్యం ఉంది. రెండు దశల సాలిడ్ ప్రొపెల్లెంట్ బాలిస్టిక్ మిస్సైల్.