Jharkhand : స్టేజ్‌‌పై యువ రెజ్లర్‌‌ను కొట్టిన ఎంపీ

గణపత్ రాయ్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న పోటీలకు ఆయన విచ్చేశారు. ఎంపీ దగ్గరకు ఓ రెజ్లర్ వచ్చి..తనకు ఆడే అవకాశం కల్పించాలని కోరాడు.

Jharkhand : స్టేజ్‌‌పై యువ రెజ్లర్‌‌ను కొట్టిన ఎంపీ

Bjp Mp Slap

Updated On : December 18, 2021 / 3:31 PM IST

BJP MP Brij Bhushan Sharan Singh : అందరూ చూస్తుండగానే..స్టేజీపై ఓ యువ రెజ్లర్ ను కొట్టారు బీజేపీ ఎంపీ. తనను జట్టులో ఆడిపించాలని కోరడమే అతను చేసిన తప్పు. పదే పదే కోరడంతో సహనం కోల్పోయిన ఆ ఎంపీ..చెంపలపై ఫటఫటా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సర్ది చెప్పాల్సింది పోయి…అలా కొడుతారా ? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Read More : 2022 Film Releases: ముందుంది అసలైన సినిమా పండగ..!

రాజధాని రాంచిలో అండర్ 15 జాతీయస్థాయి రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు జరుగుతున్నాయి. మొదటి రోజు కార్యక్రమానికి రావాలని బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను నిర్వాహకులు ఆహ్వానించారు. ఈయన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షులు. గణపత్ రాయ్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న పోటీలకు ఆయన విచ్చేశారు. ఎంపీ దగ్గరకు ఓ రెజ్లర్ వచ్చి..తనకు ఆడే అవకాశం కల్పించాలని కోరాడు.

Read More : Bharathiyar Statue : 482 కిలోల చాక్లెట్‌తో 6.6 అడుగుల మహాకవి భారతియార్‌ విగ్రహం

వయస్సు పరిమితి దాటిందని..ఆడేందుకు అనుమతి లేదని తెలిసింది. ఆడేందుకు అనుమతినివ్వాలని పదే పదే కోరాడు. దీంతో ఎంపీ శరణ్ సింగ్ సహనం కోల్పోయాడు. స్టేజీపైనే ఆటగాడి చెంపను చెళ్లుమనిపించారు. పక్కనే ఉన్న సభ్యులు ఎంపీని ఆగబట్టి..అతడిని వెళ్లిపోవాలని సూచించారు. ఈ దృశ్యాలు వైరల్ కావడంతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను ఆ ఎంపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంపీ అలా చేయాల్సి ఉండేది కాదంటున్నారు.