2020లో భారత వృద్ధి ‘0’: పొడిగించిన లాక్‌డౌన్ ప్రభావం

2020లో భారత వృద్ధి ‘0’: పొడిగించిన లాక్‌డౌన్ ప్రభావం

Updated On : April 14, 2020 / 11:01 AM IST

దేశవ్యాప్తంగా మే 3వరకూ పొడిగించిన లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక భారం పడనుంది. 234.4 బిలియన్ అమెరికన్ డాలర్ల నష్టంతో పాటు 2020 జీడీపీలో సున్నా శాతం మెరుగుదల కనిపిస్తుందంటుంది బ్రిటిష్ బ్రోకరేజ్ సంస్థ. 2020 క్యాలెండర్ ఇయర్లో భారత వృద్ధి రేటు సున్నా. ఫిస్కల్ ఇయర్ ప్రకారం చూస్తే 2021 నాటికి 0.8 శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయంటోంది ఈ సంస్థ. 

ప్రధాని మే3 వరకూ లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించకముందే కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ పెరుగుతున్న పరిస్థితుల గురించి వివరించారు. దాంతో పాటు ప్రభావితం కానీ ప్రాంతాల్లో ఏప్రిల్ 20 నుంచి రిలాక్సేషన్ ఉంటుందని మాట్లాడారు. కొన్ని ప్రాంతాలను మినహాయించినప్పటికీ యావత్ దేశ ఆర్థిక పరిస్థితిపై ఏ మాత్రం ప్రభావం చూపించదు. ముందుగా విధించిన 21రోజుల లాక్ డౌన్ పై స్పందించిన బ్రోకరేజ్ సంస్థ 120బిలియన్ డాలర్ల నష్టాన్ని సూచించినా.. లాక్ డౌన్ పొడిగింపు తర్వాత సంఖ్య మార్చింది. 

234.4 బిలియర్ డాలర్ల నష్టం రావడంతో పాటు ముందుగా ఉన్న జీడీపీ కంటే 2.5శాతం వృద్ధి ఉంటుందనుకున్నా.. రెండో లాక్ డౌన్ నిర్ణయం తర్వాత సున్నాకు దించేసింది. ఫిస్కల్ ఇయర్ వృద్ధి మాత్రం 0.8 శాతం నుంచి 3.5శాతానికి పెంచింది. ‘కొవిడ్ కేసుల కారణంగా భారత్ లో మే 3వరకూ సుదీర్ఘమైన షట్ డౌన్ ప్రకటించడం ఎకానమీపై భారీ ప్రభావం చూపిస్తుంది. కోలుకోవడానికి ముందుగా ఊహించిన దానికంటే ఎక్కువ సమయమే పడుతుంది’ అని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. 

భారతదేశంలో అధికారికంగా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ స్టేజి చేరినట్లు సమాచారం లేదు. అయినప్పటికీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఆర్థికంగా గట్టిదెబ్బే. నిత్యవసర వస్తువులు అయినా మైనింగ్, వ్యవసాయం, మాన్యుఫ్యాక్చరింగ్ వంటి వాటిపై నెగెటివ్ ఎఫెక్ట్ కనపడుతుంది. ఈ నెంబర్లు జూన్ కంటే ముందుగా లాక్ డౌన్ ముగిస్తేనే వర్తిస్తాయి. వీటిని మళ్లీ పొడిగిస్తే ఇందులోనూ మార్పులు కనిపిస్తాయని బ్రోకరేజ్ సంస్థ వెల్లడించింది. పైగా జూన్ తర్వాతకు పొడిగిస్తే ఎకానమీ రికవర్ అయ్యే పరిస్థితి కనిపించదని హెచ్చరించింది.