బ్రిటన్ రాజవంశంలో కలకలం : ప్రిన్స్ హ్యారీ, మేగన్ దంపతుల వేరు కాపురం

అనగనగా ఒక రాణి..అలాంటి ఇలాంటి రాణి కాదామె..ఒకప్పుడు భూమండలాన్ని అంతటినీ పాలించిన వంశపు మహారాణి..అంత గొప్ప రాణి కూడా ఇప్పుడు మనవడు కొట్టిన దెబ్బకి విలవిలలాడుతోంది..రాచరికపు మర్యాదకి మంట పెడుతున్నారంటూ ఆగ్రహించిందా రాణి..ఇంతకీ ఎవరీ రాణి..ఆమె మనవడి కథేంటి ..
ఇప్పుడు బ్రిటన్ దేశంలో రెండే చర్చలు నడుస్తున్నా. ఒకటి బ్రెగ్జిట్..రెండోది మెగ్జిట్..ఒకటి అర్ధమైంది రెండోదేంటంటారా ? బ్రిటన్ రాణి రెండో మనవడు ప్రిన్స్ హ్యారీ, మేగన్ దంపతులు వేరు కాపురం పెట్టాలని నిర్ణయించుకున్నారు. 200 ఏళ్లకి పైబడిన చరిత్ర ఉన్న రాజవంశం నుంచి ఇలా బైటికి వెళ్లి ఉంటామని ప్రకటించినవాళ్లు చాలా తక్కువ. దీంతో మనవడు.. మనవరాలి వైఖరిపై రాణి ఎలిజబెత్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరిప్పుడు ఏం జరగబోతుంది. క్వీన్ ఎలిజబెత్ మనవడు హ్యారీ ఇకపై ప్రిన్స్ అని కానీ డ్యూక్ ఆఫ్ ససెక్స్ అని కానీ పిల్పించుకోవడానికి ఇష్టపడటం లేదు.
రాణీమహల్ రాజ్యం మాకు అవసరంలేదు.. మేం వేరుగా ఉంటామంటూ ప్రకటించారు.. ఇందుకు ఆయన భార్య మేఘన్‌కి రాజకుటుంబంలో ఎదురైన అనుభవాలే కారణమని తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాజరికపు వ్యవస్థ నుంచి తామిద్దరం తొలగిపోతామంటూ ప్రిన్స్ హ్యారీ ప్రకటించడంతో ఒక్కసారిగా కలకలం ప్రారంభం అయింది. ఇది రాజరికపు మర్యాదని, వంశప్రతిష్టని దెబ్బతీసే అంశమంటూ క్వీన్ సహా రాజబంధువులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులు ఇద్దరూ కెనడా వెళ్తారని ప్రచారం జరుగుతోంది.. ఇది రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన విషయం కాబట్టి వీలైనంత త్వరగా ఈ వ్యవహారం సెటిల్ అవ్వాలని రాణిమహల్ భావిస్తోంది. మూడు రోజుల్లో ఈ వివాదాన్ని కొలిక్కి తీసుకురావాలంటూ బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి ఆర్డర్స్ వెలువడ్డాయి. ప్రిన్స్ హ్యారీ మాత్రం ఈ ఒప్పందం కోసం తొందరపడటం లేదట. వీలైనంత సమయం తీసుకోవాలనే నిర్ణయించారని తెలుస్తోంది. ఆరువారాల పాటు క్రిస్మస్ హాలీడేస్‌ను ఎంజాయ్ చేసి వచ్చిన వెంటనే.. ఈ బాంబ్ పేల్చిన హ్యారీ దంపతులు.. ఇప్పుడు పూర్తిగా బ్రిటన్ రాజకుటుంబానికి దూరం కావాలనుకుంటున్నారు.
ప్రిన్స్ హ్యారీ తండ్రి యువరాజు ఛార్లెస్ బిర్క్‌హాల్‌లో, రాణి ఎలిజబెత్ సాండ్రింగ్‌హామ్‌లో ప్రస్తుతం ఉంటున్నారు. మేఘన్ మార్కెల్ క్రిస్‌మస్ సీజన్‌లో కూడా తాము ఎక్కడ ఉంది కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డారు. తన కొడుకు ఆర్చీ హారిసన్‌తో వాంకోవర్ ఐలాండ్‌లో గడిపి వచ్చారామె. ప్రిన్స్ హ్యారీ మాత్రం ఆ సమయంలో తన ఇంట్లోనే ఉన్నారు. ఇంతవరకూ తమ వేరు కాపురం నిర్ణయంపై ఆయన తండ్రి ఛార్లెస్‌ని కానీ.. బామ్మ ఎలిజబెత్‌ని కానీ వ్యక్తిగతంగా కలిసి చెప్పలేదు.
ప్రతి క్రిస్మస్ సమయంలో క్వీన్ ఎలిజబెత్.. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆసమయంలో తన టేబుల్‌పై కుటుంబసభ్యులందరి ఫోటోలను ఉంచుతారు. ఐతే ఈసారి మాత్రం ఆ టేబుల్‌పై నుంచి హ్యారీ ఫ్యామిలో ఫోటోలు మాయమయ్యాయి. అప్పుడే రాయల్ ఫ్యామిలీలో ఏదో జరగబోతోందన్న సంకేతాలు వెలువడ్డాయి. ఇప్పుడు ప్రిన్స్ హ్యారీ వేరు కాపురం పెడుతున్నట్లు ప్రకటించడంతో అది నిజమే అని నిర్ధారణ అయిపోయింది.
ప్రిన్స్ హ్యారీది రాజకుటుంబం అయితే.. మేఘన్ మార్కెల్ సాధారణ కుటుంబం..ఆ మాటికి వస్తే టీనేజ్ దాటి పదేళ్లైపోయిన మహిళ.. అలాంటి లేడీని చూసి మనసు పారేసుకున్నాడు హ్యారీ . హ్యారీ, మేఘన్‌లు కలుసుకోక ముందు ఇద్దరికీ.. ఒకరి గురించి మరొకరికి పెద్దగా తెలీదంటారు..కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ పెళ్లి వరకూ వెళ్లారంటే ఆశ్చర్యమే. బ్లైండ్ డేటింగ్ చేసిన వీరిద్దరూ ఓ రోజు చికెన్ వండుకుంటున్నారట.
ఆ సమయంలో ప్రిన్స్ హ్యారీనే మేఘన్‌కి ప్రపోజ్ చేయడం ఆమె ఓకే చేయడం జరిగిపోయాయని చెప్తారు.. అలా 2017 లో వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం. అప్పటికే మేఘన్ మార్కెల్‌కి ఓసారి పెళ్లైంది కూడా. పైగా వయసులోనే మేఘన్ హ్యారీ కంటే మూడేళ్లు పెద్ద. ఇలా ఓ ఆర్డినరీ ఫ్యామిలీకి చెందడం, ఆల్రెడీ మ్యారేజ్ అయిన లేడీని పెళ్లాడటం రాయల్ ఫ్యామిలీ మెంబర్లకు ఇష్టం లేదు. హ్యారీ మాట కోసమని ఆ పెళ్లికి ఒప్పుకున్నారని ప్రచారం. అందరికన్నా ముందుగా క్వీన్ ఎలిజబెత్ అంగీకారం తెలిపారంటారు. 2018 మే నెలలో మేఘన్‌తో అత్యంత ఘనంగా జరిగిన వివాహం ప్రపంచవ్యాప్తంగా సంచలనం కల్గించింది.
Read More : ఇరాన్ ఇక ఒంటరి : బ్రిటన్ రాయబారి అరెస్టు