Mexico : సమద్రంలో మంటలు, చేరుకున్న ఫైరింజన్లు

Mexico : సమద్రంలో మంటలు, చేరుకున్న ఫైరింజన్లు

Liam

Updated On : July 3, 2021 / 11:06 AM IST

Middle Of Ocean Near Mexico : సముద్రంలో మంటలు రావడం ఏంటీ ? నీళ్లలో చెలరేగిన మంటలను ఆర్పడానికి ఫైరింజన్లు రావడం ఏంటీ ? అని ఆశ్చర్యపోతున్నారు. కానీ నిజంగానే ఇది జరిగింది. మెక్సికో సమీపంలోని మహాసముద్రంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నారింజ రంగులో మంటలు చెలరేగాయి. వృత్తాకారంలో చెలరేగుతున్న మంటలను ఆర్పడానికి ఫైరింజన్లు సముద్రంలోకి చేరుకున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Yucatan peninsula పశ్చిమాన సముద్రపు ఉపరితలపై శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయని రాష్ట్ర చుమురు సంస్థ పెమెక్స్ వెల్లడించింది. సముద్రపు నీటి అడుగున పైపులైన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని భావిస్తున్నారు. మంటలను ఆర్పడానికి సుమారు ఐదు గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. గ్యాస్ లీక్ కావడం వల్ల..ప్రాజెక్టు కంపెనీ ఉత్పత్తిపై ప్రభావం చూపించలేదని, 10.30గంటలకు మంటలు పూర్తిగా ఆరిపోయాయని కంపెనీ వెల్లడించింది. అగ్ని ప్రమాదానికి గల కారణాన్ని పరిశీలిస్తామని తెలిపింది. Ku Maloob Zaap is Pemex’s అతి పెద్ద ముడి చమురు సంస్థ.