First Pig Heart Transplant: రెండు నెలలు మాత్రమే బతికించిన పంది గుండె

హార్ట్ ట్రాన్‌ప్లాంటేషన్‌లో భాగంగా పంది గుండెను అమర్చుకున్న వ్యక్తి రెండు నెలలకే కనుమూశాడు. ఈ సర్జరీతో అవయవ మార్పిడి, అవయవ దానం ఒకడుగు ముందుకేసినట్లుగా భావించారు.

First Pig Heart Transplant: రెండు నెలలు మాత్రమే బతికించిన పంది గుండె

Heart Transplant

Updated On : March 10, 2022 / 8:53 AM IST

First Pig Heart Transplant: హార్ట్ ట్రాన్‌ప్లాంటేషన్‌లో భాగంగా పంది గుండెను అమర్చుకున్న వ్యక్తి రెండు నెలలకే కనుమూశాడు. ఈ సర్జరీతో అవయవ మార్పిడి, అవయవ దానం ఒకడుగు ముందుకేసినట్లుగా భావించారు. ఇప్పటికే మనుషుల అవయవాల మార్పిడి చేస్తున్నా భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ ప్రయత్నం జరిపారు.

జనవరి 7న డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తి పంది గుండెను అమర్చుకుని మార్చి8 వరకూ ప్రాణాలు నిలుపుకున్నారు. ఈ విషయాన్ని మేరీలాండ్ మెడికల్ సిస్టమ్ యూనివర్సిటీ ధ్రువీకరించింది.

‘కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్యం పాడవుతూ వస్తుంది. అతను ఇక కోలుకోలేడని భావించాక కారుణ్య సంరక్షణతో చూడటం మొదలుపెట్టాం. చివరి గంటల్లో ఫ్యామిలీతో మాట్లాడగలిగారు’ అని స్టేట్మెంట్ లో వెల్లడించింది.

Read Also : కొవిడ్‌తో హై-రిస్క్.. లంగ్స్​ ట్రాన్స్​​ప్లాంటేషన్‌‌కు లక్షల్లో ఖర్చు..!

సర్జరీ తర్వాత కొన్ని రోజుల పాటు మార్పిడి చేసిన గుండెతోనే ఏ ఇబ్బంది లేకుండా గడిపాడు. కుటుంబంతో కొన్ని రోజుల పాటు హ్యాపీ ఉన్న ఆయన.. ఫిజికల్ థెరపీలోనూ పార్టిసిపేట్ చేశాడు. ధైర్యంగా చివరి వరకూ పోరాడాడు. ఆ కుటుంబానికి మా సంతాపం తెలియజేస్తున్నాం. అని సర్జన్ బార్ట్లీ గ్రిఫ్త్ అన్నారు.

‘పంది గుండె మార్పిడి అనేది బాగానే పనిచేసిందని భావిస్తున్నాం. కాకపోతే మనిషి ఇమ్యూనిటీ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. మా ప్లాన్ కంటిన్యూ చేస్తున్నాం. ఫ్యూచర్ క్లినికల్ ట్రయల్స్ కు ఇది హెల్ప్ అవుతుంది’ అని కార్డియాక్ గ్జినోట్రాన్స్‌ప్లాంటేషన్ డైరక్టర్ మొహమ్మద్ మొహిద్దీన్ అంటున్నారు.