Donald Trump : అధ్యక్ష ఎన్నికలకు ముందే డొనాల్డ్ ట్రంప్ సంపద రెట్టింపు.. కమలా హారీస్ నికర విలువ ఎంతంటే?

Donald Trump Net Worth : అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నికర సంపద ఒక్కసారిగా రెట్టింపు అయింది. అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్ నికర విలువ 8 బిలియన్ డాలర్లకు పెరిగింది.

Donald Trump : అధ్యక్ష ఎన్నికలకు ముందే డొనాల్డ్ ట్రంప్ సంపద రెట్టింపు.. కమలా హారీస్ నికర విలువ ఎంతంటే?

Former US President Donald Trump’s net worth surged to 8 billion dollars

Updated On : November 1, 2024 / 9:59 PM IST

Donald Trump : సర్వేల ప్రకారం.. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. అధ్యక్ష రేసులో ఇద్దరూ హోరాహోరీగా పోటీపడుతున్నారు. రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్ పోటీ చేస్తుండగా, డెమోక్రటిక్ అభ్యర్థిగా హారిస్ పోటీ చేస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రోజు (నవంబర్ 5)కి వారం కన్నా తక్కువ సమయం ఉంది. ఇలాంటి పరిస్థితిల్లో ట్రంప్ ఎంత నికర విలువ ఎంత పెరిగిందో ఓసారి తెలుసుకుందాం.

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నికర సంపద ఒక్కసారిగా రెట్టింపు అయింది. అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్ నికర విలువ 8 బిలియన్ డాలర్లకు పెరిగింది. అక్టోబరు 29న ఆయన మీడియా సంస్థ ట్రంప్ మీడియా షేర్లలో 9శాతం పెరిగినట్టు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ట్రూత్ సోషల్‌ను నిర్వహిస్తున్న సంస్థ షేర్లు అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు ఊహాగానాల మధ్య పెరిగాయి.

అయితే, అక్టోబర్ 31న, ట్రంప్ మీడియా షేర్లలో 20శాతం తగ్గుదల తర్వాత ట్రంప్ నికర విలువ 6.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ట్రంప్ తన సంపదలో ఎక్కువ భాగాన్ని రియల్ ఎస్టేట్ హోల్డింగ్స్, ఆయన మీడియా సంస్థ నుంచి పొందారు. ఇందులో ట్రంప్ 57శాతం వాటాను కలిగి ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ రియల్ ఎస్టేట్, ప్రభుత్వ పెన్షన్‌లు, పుస్తక ఒప్పందాల ద్వారా వచ్చే ఆదాయంతో సహా 8 మిలియన్ డాలర్ల నికర విలువ కలిగి ఉన్నారు.

డొనాల్డ్ ట్రంప్ నికర విలువ :
ప్రస్తుతం, డొనాల్డ్ ట్రంప్ నికర విలువ 8 బిలియన్ డాలర్లు.. రూ.33వేల కోట్ల నుంచి రూ.67వేల కోట్లకు పెరిగిపోయింది. ఫోర్బ్స్ ప్రకారం.. అక్టోబర్ 2024లో ట్రంప్ సంపద రెట్టింపు అయింది. అక్టోబర్ ప్రారంభంలో 4 బిలియన్ డాలర్ల నుంచి మంగళవారం (అక్టోబర్ 29) 8 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ట్రాకర్ ప్రకారం.. 78 ఏళ్ల ట్రంప్ ఇప్పుడు ప్రపంచంలోని 357వ అత్యంత సంపన్న వ్యక్తిగా అవతరించారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు పెరుగుతున్న ప్రజాదరణ, ఆయన మీడియా కంపెనీ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (TMTG) షేర్లు పెరగడంతో ట్రంప్ సంపద కూడా ఒక్కసారిగా రెట్టింపు అయింది.

ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ట్రూత్ సోషల్’ పేరంట్ కంపెనీ అయిన ట్రంప్ మీడియా షేర్లు దాదాపు 9 శాతం పెరిగి 51.51 డాలర్ల వద్ద ముగిశాయి. గత సోమవారం 21.6శాతం లాభాన్ని నమోదు చేసింది. టీఎంటీజీ మార్కెట్ వాల్యుయేషన్ 10 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ. ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ కంపెనీ ఎక్స్ ప్లాట్ ఫారంకు సమానం. గత అక్టోబర్‌లో ట్రంప్ సంపద రెండింతలు కాగా, ట్రంప్ మీడియా స్టాక్ ధర అక్టోబరు ప్రారంభంలో 16.16 డాలర్ల నుంచి 3 రెట్లు (249.2శాతం పెరుగుదల) పెరిగింది.

డొనాల్డ్ ట్రంప్ వారసత్వ ఆస్తి :
డోనాల్డ్ ట్రంప్ తన తండ్రి నుంచి 413 మిలియన్ డాలర్ల మొత్తం ఆస్తిని వారసత్వంగా పొందినట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రెండేళ్లలో 73 మిలియన్ డాలర్లు సంపాదించినట్లు నివేదిక వెల్లడించింది. ఇందులో, ట్రంప్ భారత్ నుంచి లైసెన్స్ ఒప్పందాల ద్వారా సుమారు 2.3 మిలియన్ డాలర్లు సంపాదించారు. భారత్‌లో 1,45,400 డాలర్ల పన్ను చెల్లించారు.

ట్రంప్ అమెరికాలో కేవలం 750 డాలర్ల పన్నులు మాత్రమే చెల్లించాడు. నివేదిక ప్రకారం.. “వైట్ హౌస్‌లో ఆయన మొదటి రెండు సంవత్సరాలలో ట్రంప్ విదేశీ ఆదాయంలో ఎక్కువ భాగం స్కాట్లాండ్, ఐర్లాండ్‌లోని గోల్ఫ్ ఆస్తుల నుంచి సంక్రమించింది. అదనంగా, ఫిలిప్పీన్స్ నుంచి 3 మిలియన్ డాలర్లు, భారత్ నుంచి 2.3 మిలియన్లు డాలర్లు, టర్కీ నుంచి 1 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని కూడా ట్రంప్ ఆర్జించారు.

Read Also : US Elections 2024 : హారిస్ వర్సెస్ ట్రంప్ లేటెస్ట్ పోల్స్ : అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు ఆధిక్యంలో ఉన్నారంటే?