టబ్‌లు, టాయిలెట్ల నుంచి స్విమ్మింగ్‌పూల్‌ల వరకూ అంతా బంగారమే!!

టబ్‌లు, టాయిలెట్ల నుంచి స్విమ్మింగ్‌పూల్‌ల వరకూ అంతా బంగారమే!!

Updated On : July 3, 2020 / 10:15 PM IST

వియత్నాం క్యాపిటల్ హనోయ్.. లో గెస్ట్ లను అట్రాక్ట్ చేయడానికి చాలా ఖరీదైన ప్లాన్ వేశారు. బంగారపు ప్లేట్లతో బాత్‌టబ్‌లు, బేసిన్లు, టాయిలెట్లు అన్నీ బంగారపుమయం చేశారు. మూడు నెలల కరోనా వైరస్ లాక్‌డౌన్ తర్వాత వియత్నాంలోని డాల్సి హనోయ్ గోల్డెన్ లేక్ హోటల్ రీ ఓపెన్ అవుతున్న సందర్భంగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు అద్భుతమైన ఆఫర్లతో ముస్తాబవుతోంది.

హోవా బిన్ గ్రూపుకు చెందిన హోటల్ ను అమెరికాకు చెందిన వ్యంధం హోటల్స్ & రిసార్ట్స్ ఇన్‌క్లూజివ్ మేనేజ్ చేస్తుంది. ప్రపంచంలో మరే హోటల్ లేనంతగా దీన్ని రెడీ చేశారని చైర్మన్ హూ డాంగ్ అంటున్నారు. హోటల్ లో 24 క్యారెట్ ల బంగారంతో ఇన్ఫినిటీ‌పూల్‌ను రూఫ్ టాప్ మీద ఏర్పాటు చేశారు.

గెస్ట్ రూంల లోపల, బాత్రూమ్ లలో బంగారంతో నింపేశారు. ఈ హోటల్ లో ఉండాలంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దానికి అయ్యే ఖర్చు ఒక్క రాత్రికి 250 అమెరికన్ డాలర్లు(రూ.18వేల 716)అవుతాయి. సిటీలో లగ్జరీ అకమెడేషన్ అందించే హోటళ్లకు సమానం ఛార్జిలు వసూలు చేస్తున్నారు.

లగ్జరీ అనేది ఎంతవరకూ ఉండొచ్చనే దానిపై నా మనసు మారిపోయింది. ఇతర లగ్జరీ హోటళ్లు మార్బుల్స్ వాడతాయి. కానీ, ఇక్కడ ప్రతీది గోల్డెన్ ప్లేటెడ్ గా ఉంటుంది. వాష్ బేసిన్ తో సహా. అని హోటల్ ఓనర్ అంటున్నారు. నోవల్ కరోనా వైరస్ నుంచి పోరాడటంలో వియత్నాం సక్సెస్ అయింది. 350 కేసులు నమోదైనా ఒక్క చావు కూడా లేకుండా గట్టెక్కింది. ఒకవేళ ఈ మహమ్మారి దాపరించకపోతే హోటల్ పూర్తిగా విదేశీ అతిథులతో నిండిపోయేదని అంటున్నారు.

హోటల్ గోడలకు కూడా బంగారపు ప్లేట్లతో కవర్ చేసేశారు. దీని కోసం దాదాపు ఒక టన్ను బంగారం అవసరమైందట. ఇంతటితో ఆపకుండా వియత్నాం సిటీలో మరో గోల్డ్ ప్లేటెడ్ ప్రాజెక్ట్ చేయాలని హో చి మిన్ అనుకుంటున్నారు.