Adam Mosseri : ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి జాబ్ ప్రొఫైల్ చూసారా? వెయిటర్‌గా పనిచేసి.. ఆ తరువాత
ఒకప్పుడు నేను చాలా చిన్న జాబ్ చేసాను.. ఇప్పుడు ఈ స్ధాయిలో ఉన్నాను అంటూ చాలామంది తమ కెరియర్ ప్రారంభంలో అనుభవాలు చెబుతారు. కష్టపడితేనే కానీ గొప్ప స్ధాయి రాదు. ఈరోజు ఇన్‌స్టాగ్రామ్ హెడ్‌గా ఉన్న ఆడమ్ మోస్సేరి తన కెరియర్‌ను వెయిటర్‌గా ప్రారంభించారు. థ్రెడ్స్‌లో ఆయన తన జాబ్ హిస్టరీని షేర్ చేసారు.

Adam Mosseri
Adam Mosseri : ప్రతి ఒక్కరికి జాబ్ ప్రొఫైల్ ఉంటుంది. కొంతమందికి లక్ కలిసి వస్తే ఒక్కసారిగా గొప్ప పొజిషన్‌కి వెళ్లిపోతారు. కొంతమంది ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ఎదుగుతూ ఉన్నత స్ధాయికి చేరుకుంటారు. ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి తన ఉద్యోగ చరిత్రను పంచుకున్నారు. ఆయన షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. చాలామంది ఆయన పోస్ట్ కింద తమ జాబ్ ప్రొఫైల్స్ షేర్ చేసుకున్నారు.
ఆడమ్ మోస్సేరి తన జాబ్ హిస్టరీని థ్రెడ్స్‌లో షేర్ చేసుకున్నారు. ఆయన పోస్టు వైరల్ అవుతోంది. వెయిటర్ నుండి ఇన్‌స్టాగ్రామ్ హెడ్ వరకు ఆడమ్ మోస్సేరి తన ఉద్యోగ చరిత్రను పంచుకున్నారు. మోస్సేరి తన వృత్తిని వెయిటర్‌గా ప్రారంభించి ఆ తరువాత బార్టెండర్‌గామారినట్లు వెల్లడించారు. మూడవ జాబ్ డిజైనర్, మరియు మేనేజర్‌గా చేసారు. ఆ తరువాత ప్రాడక్ట్ మేనేజర్ అయ్యారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఆయన షేర్ చేసిన పోస్టుపై నెటిజన్లు స్పందించారు.
Ankur Warikoo : సోషల్ మీడియాలో తన ‘ఫెయిల్యూర్ రెజ్యూమ్’ పంచుకున్న యూట్యూబర్, రచయిత అంకుర్ వారికూ
వాట్ ఎ రెజ్యూమ్ అని.. అద్భుతం అంటూ కామెంట్లు పెట్టారు. కొందరు తమ జాబ్ హిస్టరీని షేర్ చేసుకున్నారు.

Adam Mosseri