ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు, ఇంధన ట్యాంకర్ ఢీకొని 48మంది మృతి

ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, రెస్క్యూ సిబ్బంది ఘటన స్థలంకు చేరుకోవటం జరిగింది. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించగా..

ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు, ఇంధన ట్యాంకర్ ఢీకొని 48మంది మృతి

Nigeria

Nigeria : నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, ఇంధన ట్యాంకర్ ఢీకొనగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 48 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోగా.. 50 మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి. మంటల్లో చిక్కుకొని మృతదేహాలను గుర్తించలేని విధంగా కాలిపోయాయి. ఆదివారం సాయంత్రం ఉత్తర్ – మధ్య నైజర్ రాష్ట్రంలోని అగాయ్ ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తర – మధ్య నైజర్ రాష్ట్రంలోని స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లాహి బాబా -అరబ్ మాట్లాడుతూ.. ప్రయాణికులు, పశువులను తీసుకెళ్తున్న ట్రక్కును ఇంధన ట్యాంకర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పేర్కొంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఈ ప్రమాదంలో అనేక ఇతర వాహనాలు కూడా దగ్దమయ్యాయని అన్నారు.

Also Read : కూలిన బ్రిడ్జి, అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు- ఏపీలో వర్ష బీభత్సం

ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, రెస్క్యూ సిబ్బంది ఘటన స్థలంకు చేరుకోవటం జరిగింది. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించగా.. తొలుత 30 మృతదేహాలను గుర్తించడం జరిగిందని, ఆ తరువాత మరో 18మంది మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో కాలిపోవటం జరిగిందని బాబా-అరబ్ తెలిపారు. ఘోర ప్రమాదంపై విచారం వ్యక్తంచేసిన నైజర్ రాష్ట్ర గవర్నర్ మహమ్మద్.. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

 

నైజీరియాలో ట్రక్కు ప్రమాదాలు నిత్యం జరుగుతుంటాయి. సమర్ధవంతమైన రైల్వే వ్యవస్థ లేకపోవటంతో రోడ్డు మార్గంలో భారీగా సరుకు రవాణా జరుగుతుంది. ఈ క్రమంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 2020లోనే నైజీరియాలోని ఫెడరల్ రోడ్ సేఫ్టీ కార్ప్స్ 1,531 ట్యాంకర్ ప్రమాదాలు జరిగినట్లు తెలిపింది. ఈ ప్రమాదాల్లో 535 మంది మరణించారు. మరో వెయ్యికి పైగా ప్రయాణీకులు గాయపడ్డారు.