ట్రంప్ టాయిలెట్ బ్రష్‌లు వచ్చేశాయి : ఫుల్ డిమాండ్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చాలా విషయాల్లో ఆయన హాట్ టాపిక్. ఇప్పుడు మార్కెట్ లో ఆయన బొమ్మతో తయారు చేసిన టాయ్ లెట్ బ్రష్ లు హల్ చల్ చేస్తున్నాయి. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు పేరుతో బ్రష్ లంటే మాటలా మరి..ఇప్పుడవి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎంతలా అంటే ఈ బ్రష్‌ల కోసం కస్టమర్లు ఆర్డరిచ్చి ఏకంగా 6 నుంచి 8 వారాలు వేచి చూసేంతగా డిమాండ్ ఉంది ట్రంప్ బ్రష్ లకు. ఎప్పుడూ ఏదో వివాదంలో చిక్కుకొని ట్రంప్ నెటిజన్లకు మంచి టాపిక్ గా ఉండటం ట్రంప్ ప్రత్యేకత.
వ్యాపారులు తమ తెలివితేటల్ని ఉపయోగించి ట్రంప్ ముఖ చిత్రంతో తయారు చేసిన టాయిలెట్ బ్రష్‌లను రూపోందించి సొమ్ము చేసుకుంటున్నారు. ETSY.comలో అమ్మకానికి పెట్టిన ఈ బ్రష్‌లు న్యూజిలాండ్ నుంచి దిగుమతి అవుతున్నాయి. కానీ ఈ బ్రష్ లను తయారు చేస్తున్న వారి వివరాలు మాత్రం తెలియటంలేదు. చేతితో తయారు చేసిన ఈ బ్రష్ హ్యాండిల్ చివరి భాగంలో బ్లూసూట్ రెడ్ టై కట్టుకున్న ట్రంప్ ముఖ చిత్రంతో చూడ ముచ్చలగా ఉంది ఈ టాయ్ లెట్ బ్రష్.
దీంతో ఈ బ్రష్ వైవిధ్యంగా ఉండటంతో కస్టమర్లు ఎగబడుతున్నారు. ‘నా టాయిలెట్ బ్రష్ మీద ఉన్నట్లు ఏ టాయిలెట్ బ్రష్‌పై దేశ అధ్యక్షులు లేరోచ్!.’ అని ఓ వినియోగదారుడు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ బ్రష్‌కు రివ్యూ ఇవ్వడం గమనార్హం.