Great-Great-Great Grandmother: మనవరాలికే మనవరాలు.. ఆరు తరాలు ఒకే ఫ్రేములో!

ప్రస్తుత జనరేషన్ లో మనువరాలికి కూతురి పుట్టేవరకూ మాత్రమే చూడగలుగుతున్నారు. యూకేలో ఉంటున్న ఈ 86ఏళ్ల మహిళ మాత్రం తన కళ్ల ముందు ఆరు జనరేషన్లను చూసింది. స్కాట్‌లాండ్ లో ఉండే మ్యారీ మార్షల్ వయస్సు86ఏళ్లు.

Great-Great-Great Grandmother: మనవరాలికే మనవరాలు.. ఆరు తరాలు ఒకే ఫ్రేములో!

Great Great Great Grandmother She Has 90 Grandchildren

Updated On : June 20, 2021 / 3:34 PM IST

Great-Great-Great Grandmother: ప్రస్తుత జనరేషన్ లో మనువరాలికి కూతురి పుట్టేవరకూ మాత్రమే చూడగలుగుతున్నారు. యూకేలో ఉంటున్న ఈ 86ఏళ్ల మహిళ మాత్రం తన కళ్ల ముందు ఆరు జనరేషన్లను చూసింది. స్కాట్‌లాండ్ లో ఉండే మ్యారీ మార్షల్ వయస్సు 86ఏళ్లు. ఎనిమిది మందికి తల్లి అయిన ఈమె అమ్మమ్మకే అమ్మమ్మ అయిపోయింది.

తనకు మొత్తం 90మంది మనవలు, మనువరాళ్లు. కొద్ది వారాల క్రితం ఆమెను కలవడానికి తన ఎనిమిది మంది పిల్లలు వాళ్ల పిల్లలతో వచ్చారు. ఇప్పుడు నైలా ఫెర్గ్యూసన్ అనే చిన్నారి పుట్టడంతో అధికారికంగా గ్రేట్-గ్రేట్-గ్రేట్-గ్రాండ్ మదర్ అయిపోయింది.

Grand Mothers

Grand Mothers

టోనీ లై.. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు.. ఏదో రికార్డ్ బ్రేక్ చేస్తాననే ఆనదంలో ఉందట. ఫ్యామిలీలో మరొకరు రాబోతుండటంతో అమ్మమ్మకి అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందోనని ఆలోచించేదాన్ని అని ఆమె చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలిసిన మ్యారీ మార్షల్ తానెంతో అదృష్టవంతురాలినని ఎప్పుడూ తన కోసం ఎవరో ఒక మనువడో, మనువరాలో వస్తూనే ఉంటారని చెబుతుంది.

నిజంగా చెబుతున్నా. నేనెంతో అదృష్టవంతురాలిని. ఇంత పెద్ద ఫ్యామిలీ నాకుంది. ప్రతి రోజూ నాకోసం ఎవరో ఒకరు వచ్చిపోతుంటారని సంతోషంగా చెబుతున్నారు మ్యారీ.